Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasadarahasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

తమిళనాడు తీర్థయాత్రలు - కర్రా నాగలక్ష్మి

ఈ వారం మనం నవగ్రహాలలో ఏడవదైన శనిగ్రహం గురించి తెలుసుకుందాం , అతి పురాతనమైన శనీశ్వరున మందిరం గురించి కూడా  తెలుసుకుందాం శనీశ్వరుడు సూర్యుడు ఛాయలకు పుట్టిన పుతృడు , యముడు , యమునలకు సహోదరుడు . శనికి మన పురాణాలలో ఈశ్వరుని దర్జా యివ్వబడింది . అందుకే శనిని శనీశ్వరుడని అంటారు .

శని గ్రహం ఒకరాశినుంచి మరొకరాశికి మారడానికి సుమారు 2.5 సంవత్సరాలు పడుతుంది . శనిగ్రహం మేషరాశి నుంచి మేషరాశి కి రావడానికి సుమారు 27 సంవత్సరాలు పడుతుంది . జాతక చక్రంలో నాలుగు , ఎనిమిది గడులలో వుంటే అర్ధాష్టమ , అష్టమ శని అని అంటారు , పన్నెండు , ఒకటి , రెండు రాశులలో వున్నప్పుడు 7.5 సంవత్సరాల శనిమహాదశ నడుస్తోంది అని అంటారు . శని గ్రహం నీచం లో వున్నప్పుడు ఆరోగ్యం మందగించడం , పనులలో జాప్యం , కళావిహీనమవట , ఆరోగ్యలోపం మొదలయినవి జరుగుతాయి . చాలామందిలో శనిగ్రహం గురించి యెన్నో అపోహలు వున్నాయి . శని దశ నడుస్తోందంటే ఆవ్యక్తి అన్నింటిలోనూ అపజయాలు పొందుతాడని , పాతాళంలో పడిపోతాడని , యే పనీ సవ్యంగా జరగదనే అపోహలు వున్నాయి . కాని నిజానికి శని గురించి పూర్తిగా తెలుసుకోవాలి , శని తల్లి ఛాయాదేవికిచ్చిన మాట ప్రకారం తల్లితండ్రుల మీద అభిమానం , వారిపట్ల ఆదరణ వున్నవారి పై శని ప్రభావం వుండదని అంటారు . వ్యక్తి ఈ జన్మ లో చేసుకున్న పాపపుణ్యాలను బేరీజువేసి వాటి ప్రకారంగా ఫలితాన్ని యిస్తాడు శని . శని ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే ఈశ్వరుని వల్ల కూడా కాదు అనే విషయాన్ని తెలియజేసే కథలు మనకు యెన్నో ప్రచారంలో వున్నాయి .

అందులో ఒక కథ చెప్పుకుందాం , దీనిలో నిజమెంతో తెలీదు నేను కూడా విన్నదే .

స్వర్గలోక అధిపతి అయిన ఇంద్రుడు ఒకసారి శనీశ్వరునితో వాదనలో తనపై శనిప్రభావం వుండదని తాను దేవతలరాజని భింకాలు పలుకగా శనీశ్వరుడు తన ప్రభావం అందరిపై వుంటుందని మరునాడు సూర్యోదయం అనంతరం తాను ఇంద్రుని పడతానని వీలైతే తప్పించుకోమని చెప్తాడు . మరునాడు సూర్యోదయానికి పూర్వమే ఇంద్రుడు అడవిలోకి పారిపోయి ఒకచెట్టు తొర్రలో కూర్చొని సూర్యాస్తమయం అయేక బయటకి వస్తాడు , బయటనిలబడివున్న శనీశ్వరుని చూసి నీ ప్రతాపం నుంచి తప్పించుకున్నానని అనగా శనీ శ్వరుడు తాను పట్టడం వలనే దేవతలరాజు అన్నింటిని వదులుకొని అడవిలో తిండిలేక వుండవలసివచ్చిందని అంటాడు . ఎంతటివారైనా శని ప్రభావం నుంచి తప్పించుకోలేరని తెలియజెయ్యడానికి యీ కథ చెప్తారు . అలాగే చెడు ప్రభావం తగ్గించుకోడానికి అవకాశం వుంది .

శనిని శనీశ్వరుడు అని అంటారు . శనీశ్వరున ప్రభావం తగ్గించుకోడానికి శనీశ్వరుని కోవెలలో నల్లబట్టలుకట్టుకొని తలార స్నానంచేసి శనీశ్వరునికి నువ్వులనూనె సమర్పించాలి , వ్యక్తి జాతకరీత్యా శని ప్రభావాన్ని అంచనా వేసి చెయ్యవలసిన పరిహారాలు తెలుసుకొనివాటిని ఆచరిస్తే తప్పక శని ప్రభావం తగ్గుతుందని అంటారు . మనదేశంలో ముఖ్యమైన శని మందిరాలు శినిశింగణాపూర్ ( మహారాష్ట్ర ) , మందపల్లి ( ఆంధ్రప్రదేశ్ ) , శని ధామ్ ఢిల్లి , తిరునల్లారు ( పాండిచ్చేరి ) .

శనీశ్వరుని మందిరాలలలో అతి పురాతనమైన మందిరం పాండిచ్చేరి రాష్ట్రానికి చెందిన కారైకాల్ జిల్లాలో ‘ తిరునల్లారు ‘ పట్టణం లో వుంది . ఈ మందిరం సుమారు 3వేల సంవత్సరాలకి పూర్వం నిర్మించినట్లుగా తెలుస్తోంది .

ముందుగా ఈ వూరు పేరుకి అర్దం తెలుసుకుందాం . నల + ఆరు నల్లారు , నల అంటే నలుడు , ఆరు అంటే విముక్తి అని అర్దం , ఆరు అన్నది తమిళపదం , తెలుగుపదం కాదని మనవి .

నలుడు అంటే నలమహారాజు శని ప్రభావం నుంచి విముక్తిపొందిన ప్రదేశం యిది . కుంభకోణానికి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో వుంది , చిదంబరం నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలోను , మైలదుత్తురై రైల్వేస్టేషనుకి 30 కిలోమీటర్ల దూరంలోని వుంది . పాండిచ్చేరికి సుమారు 100 కిలోమీటర్లదూరంలో వుంది .

30 యేళ్ల క్రిందట మొదటిసారి మేం వెళ్లినప్పుడు కోవెలకి యెదురుగా బస్సు ఆగింది , యెదురుగా టీ బండి తప్ప మరేం లేదు . తిన్నగా వెడితే కోవెల ద్వారం వుండేది , ఇప్పుడు వూరికి రెండు కిలోమీటర్లముందునుంచి హోటల్స్ , గెస్ట్ హౌస్ లు , పూజా సామానులు అమ్మే దుకాణాలు వచ్చేయి , మందిరంలో కూడా చాలా మార్పులు వచ్చేయి , ఒకరు యిద్దరుగా వుండే భక్తులు వేలలో పెరిగేరు , శనివారం , శనిత్రయోదశి లకు అడగనే అక్కరలేదు . పెద్దపెద్ద క్యూలు పోలీసులు చాలా హడావిడి పెరిగిపోయింది .

ఈ కోవెల రెండు ప్రాకారాలలో వుంటుంది , అయిదంతస్థుల గోపురంతో చాలా విశాలమైన కోవెల . ముఖ్యద్వారం దాటుకొని లోపలకి వెళితే విశాలమైన ఆవరణ ఓపక్క ఆఫీసులు , మరో పక్క అర్చన మొదలైన సేవలకు కావలసిన టికెట్ల కౌంటర్లు వుంటాయి . మరోపక్క నూనెదీపాలు వెలిగించి వుంచడానికి వెదురుకర్రలతో నిర్మించిన ప్రదేశం వుంటాయి .

ఈ కోవెలకూడా 274 పాతాళ పేత్ర స్థలాలలో ఒకటి .

గర్భగుడిలో దర్భారణ్యేశ్వరుని పేరుతో పూజలందుకుంటున్న పెద్ద శివలింగం , దర్భారణ్యేశ్వరుని పూజించుకొని యెడమవైపునున్న అమ్మవారి కోవెలకు వెళుతూవుంటే గర్భగుడి ఆనుకొని వున్న చిన్న మందిరంలో శనీశ్వరుని మందిరం వుంటుంది . అంటే ద్రభారణ్యేశ్వరునికి ద్వారపాలకునిగా వున్నట్లుగా శనీశ్వరుడ వుంటాడు . శనీశ్వరుని దర్శించుకొని తరువాత అమ్మవారిన దర్శించుకోవాలి . ఇక్కడ భక్తులు యిచ్చే దానాలు , తైలాభిషేకాలు పూజారులు నిర్వర్తిస్తారు . 

మనం ముందు చెప్పుకున్నట్లుగా యీ వూరికి తిరునల్లారు అనే పేరు యెందుకొచ్చిందో చెప్పుకున్నాం కదా ? దాని వెనుక నున్న కథ కూడా చెప్పుకుందాం .

నల మహారాజు దమయంతి స్వయం వరంలో దిక్పాలకులు నలుని వలె రాగా దమయంతి ఈశ్వరుని ప్రార్ధించి రెప్పపాటు లేని వారిని దేవతలుగా గుర్తించి పరిణయ మాడుతుంది . నలమహారాజు అతి గర్వముతో దేవతలను ధిక్కరించగా వారు శనీశ్వరున వద్దకు వెళ్లి నలునకు గర్వభంగము కలిగించవలెనని చెప్పగా శనీశ్వరుడు అతని మహాదశలో నలునకు గర్వభంగము కలిగించాలన యోచన చేస్తాడు . శని ప్రభావమున నలమహారాజు రాజ్యము పోగొట్టుకొని అడవుల పాలై తినటానిక యేమీ దొరకక తిరుగాడుతూ వుండగా ఓ నాడు అతనిని కాలసర్పం కాటు వేస్తుంది , ఆవిషప్రభావమున నలుడు తన రూపమును కోల్పోయి , గతము మరచిపోయి ఓ చిన్న రాజు వద్ద వంటలు చేసుకుంట బ్రతుకుతూ వుంటాడు . ఓ నాడు శనీశ్వరుడు నలుని వద్దకు వెళ్లి రాజుకొన గొప్పవాడు యెవరు అని అడుగగా విధాత అని యెవ్వరూ తప్పించుకోలేనిది యేది అనగా విధవరాల అని జవాబులు చెప్తాడు .

సంతుష్టుడైన శని నలుని తలపై చెయ్యవేస్తాడు , పూర్వజ్ఞానం కలిగిన నలుడు శనీశ్వరుని రకరకాలుగా స్థుతించి తనకు శని ప్రభావమునుంచి ముక్తి కలిగించిన ప్రార్ధించగా శనీశ్వరుడు ధర్భలతో కూడుకొని యున్న అరణ్యంలో స్వయంభూ శివలింగానికి యెదురుగా వున్న కొలనులో స్నానం చేసి తడిబట్టలతో శివుని దర్శించుకుంటే నలునకు వినతి కలిగి పూర్వపద వైభవం కలుగుతుందని చెప్తాడు . నలుడు శనీశ్వరుడ చెప్పిన ప్రదేశం వెతుకుంటూ వెళ్లి అక్కడ స్వయంభూ లింగాన్ని కనుగొని యెదురుగా వున్న కొలనులో స్నానం చేసి శివలింగాన్ని దర్శించుకొని శని ప్రభావం నుంచి ముక్తి పొందేడు . ఇప్పటికీ భక్తులు నలతీర్ధం లో ( నలుడు స్నానం చేసిన కొలను ) స్నానం చేసి తడిబట్టలతో శివుని దర్శించుకొని , శనీశ్వరున దర్శనం చేసుకొన తిరిగి నలతీర్ధం లో స్నానం చేసి ఆ బట్టలను అక్కడే విడిచిపెట్టి కొత్తబట్టల ధరించి వెనుకకు తిరిగిచూడకుండా వెళ్లిపోతారు . కేకలు యెదురుగా వున్న తీర్థం లో కూడా నీరు స్వచ్చంగా వుంటుంది , అక్కడకూడా భక్తులు స్నానాలు చేస్తూ వుంటారు కాని అది నలతీర్ధం కాదు , కోవెలకు పక్కగా కాస్తదూరం అంటే సుమారు వంద అడుగుల దూరంలో వున్న తీర్ధం నలతీర్ధం . భక్తుల సౌకర్యార్ధం బోర్డుల పెట్టేరు . పర్వదినాలలో వచ్చే వేలాది భక్తులను అదుపు చేసే పద్దతి మాత్రం అధ్బుతమనే చెప్పాలి . పోలీసులు మందిర సిబ్బంది చాలా బాగా కంట్రోల్ చేసి అందరకీ దర్శనం బాగా జరిగేటట్ల చర్యలు తీసుకుంటారు .

ఇక్కడకూడా మందిరం వెనుకవైపు వినాయకుడు , వల్లీ సమేత కుమారస్వామి , దుర్గాదేవి , లింగోద్భవం , సంధికేశ్వరుడు , స్థలవృక్షమైనదర్భ , సూర్య చంద్రులు , భైరవుడు మొదలైన విగ్రహాలను చూడొచ్చు . వీధి మొదలునుంచే షెడ్ లు నిర్మించ క్యూలైనులు యేర్పరచి చాలా బాగా పునర్నిర్మాణం చేసేరు . ఈ కోవెల ఏడవ శతాబ్దం చివరలో పాంఢ్యరాజైన ముచుకంఠుడు నిర్మించినట్లు చెప్తారు . చరిత్రలో వున్న యీ కథ గురించి కూడా తెలుసుకుందాం . ముచుకంఠమహారాజు కాలంలో జైనమతం బాగా ప్రచారంలో వుండగా రాజు ప్రజలు కూడా జైనమతాన్ని స్వీకరిస్తారు , కాని మంత్రి మరియు రాణి జైనమతాన్ని స్వీకరించక శైవులుగానే వుండిపోతారు . జైనముునులు రాజువద్దకు వచ్చి రాణిని కూడా జైనమతంలోని మార్చమని చెప్పగా రాణి శైవమత గోప్పదని వాదిస్తుంది . జైనమునులకు రాణికి జరిగిన వాదనలో వారు ఓ ఒప్పందానికి వచ్చి ఓ నిర్ణీత ప్రదేశంలో అగ్నిగుండం యేర్పరచి తమ పవిత్ర గ్రంథాలను అగ్నిలో పడవేయాలి , అగ్నిలో యే గ్రంథాలు కాలిపోతాయో ఆ మతం రెండవమతం గొప్పదని ఒప్పుకోవాలి , రాజు ప్రజలు ఆ మతాన్ని స్వీకరించాలి అని . రాణి పరమ శైవభక్తుడైన జ్ఞాన సంబంధార్ ను పిలిపిస్తుంది . అతను రచించిన దరాభారణ్యేశ్వరుని పై రచించిన పవిత్రగ్రంధాన్ని అగ్నిలో పడవేయగా ఆ తాళ పత్రాలు కాలవు , తరువాత జైనమునులు వారి గ్రంధాలను అగ్నిలో వేయగా అవికాలిపోతాయి , యిచ్చిన మాటప్రకారం రాజు ప్రజలు తిరిగి శైవమతంలో చేరిపోతారు . ముచుకంఠరాజు దర్భారణ్యేశ్వరునికి మందిరం నిర్మించేడు .

ఈ మందిరం మధ్యాహ్నం పన్నెండునుంచి నాలుగుగంటల వరకు మూసివేస్తారు .వచ్చేవారం రాహుగ్రహస్థలం గురించి తెలుసుకుందాం అంతవరకు శలవు .

మరిన్ని శీర్షికలు
endaro mahanubhavulu andarikee vandanaalu