యంగ్ హీరో రామ్ కథానాయకుడిగా డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'ఇస్మార్ట్ శంకర్' అనే క్యాచీ టైటిల్‌ని ఫిక్స్ చేశారు. రీసెంట్‌గా స్టార్ట్ అయిన ఈ సినిమాతో పూరీ బౌన్స్ బ్యాక్ అవ్వాలనే కసితో ఉన్నాడనిపిస్తోంది. స్టార్టింగ్ డే నుండే సినిమాని ప్రమోట్ చేయడం మొదలెట్టేశాడు పూరీ. ఇంటెలిజెంట్ స్క్రీన్‌ప్లేతో, పూరీ మార్క్ మాస్ అప్పీల్‌తో ఈ సినిమా ఉండనుందని రామ్ ఫస్ట్‌లుక్ చూస్తేనే అర్ధమవుతోంది. అలాగే మాస్ అప్పీల్‌తో పాటు కథనం క్లాస్‌గా పరుగులు పెట్టిస్తుందనీ సమాచారమ్. ఇకపోతే ఈ సినిమాలో రామ్ ఇద్దరు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయనున్నాడట. అందులో 'మజ్ను' భామ నిధి అగర్వాల్ పేరును అధికారికంగా ప్రకటించారు.
మరో భామగా 'నన్ను దోచుకుందువటే' ఫేం నభా నటేష్ పేరును పరిశీలిస్తున్నారు. సినిమాలో రామ్ క్యారెక్టర్‌ని చాలా స్మార్ట్‌గా డిజైన్ చేశాడట. సహజంగానే పూరీ హీరోలు స్మార్ట్‌గా ఉంటారు. ఈ సినిమాలో హీరో నెక్ట్స్ లెవల్ ఎనర్జీతో కనిపిస్తాడట. కాగా ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉండే రామ్ ఈ సినిమా కోసం మరింత ఎనర్జిటిక్‌గా మారిపోయాడు. ఆ ఎనర్జీని రీల్ కోసమే కాదు, రియల్‌గా కూడా చూపించేశాడు రామ్. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటున్నాడు. అందులో భాగంగానే తాజాగా సోషల్ మీడియాలో తెలుగు రాష్ట్రాల విషయమై టంగ్ స్లిప్ అయ్యి అనుకోకుండా వివాదాల్లో చిక్కుకునే పరిస్థితి ఎదురైంది. దాన్ని ఇస్మార్ట్‌గా ఆలోచించి రామ్ ఎస్కేప్ అయ్యాడు.
|