బాలయ్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ఎన్టీఆర్' బయోపిక్‌లో మొదటి పార్ట్ 'కథానాయకుడు' సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోకపోవడంతో రెండో పార్ట్ 'మహానాయకుడు' రిలీజ్ విషయమై కొంత గందరగోళం నెలకొంది. మొదట్లో ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానున్న 'మహానాయకుడు' సినిమాని 14కు వాయిదా వేశారు. కానీ 21కి కూడా ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. 'కథానాయకుడు' డిస్ట్రిబ్యూటర్స్‌కే 'మహానాయకుడు' సినిమాని ఫ్రీగా ఇచ్చేశారు బాలయ్య. అయినా ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. తన తండ్రి గౌరవార్ధం బాలయ్య చేసిన సినిమా ఇది. అందుకే సినిమా విషయంలో లాభ నష్టాలు ఆశించడం లేదు. 'కథానాయకుడు'కి పోజిటివ్ రివ్యూసే వచ్చాయి. కానీ వసూళ్లు దెబ్బ తీశాయి. సినిమా డిజాస్టర్ అనే ప్రస్థావన కాస్త ఇబ్బందికరంగానే అనిపించింది.
దాంతో 'మహానాయకుడు' సినిమా విడుదల ఆపేయడమే సబబు అని బాలయ్యకు అత్యంత సన్నిహితులు సూచిస్తున్నారట. అయితే తీసిన సినిమాని ఆపేయడం సమంజసం కాదని ఆలోచిస్తున్నారట. ఏది ఏమైనా 'మహానాయకుడు' ఎప్పుడొస్తాడనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే.
|