Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
niharika naughty treat in suryakantam teaser

ఈ సంచికలో >> సినిమా >>

క్రిష్‌ - కంగనా: తప్పెవరిది.?

Krish - Kangana: wrong.

వీరనారి ఝాన్సీలక్ష్మీభాయ్‌ జీవితగాధగా తెరకెక్కిన సినిమా 'మణికర్ణిక'. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయం అందుకుంది. విజయం అనే మాట కన్నా, అందరి చేతా ప్రశంసలు దక్కించుకుంటోందని చెప్పాలి. ఇదిలా ఉంటే, 'మణికర్ణిక' సినిమా స్టార్ట్‌ అయినప్పుడే పలు వివాదాలు చుట్టుముట్టాయి. ఎలాగోలా సినిమా పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా చివరి దశలో ఉండగానే క్రిష్‌ ఈ సినిమా దర్శకత్వం నుండి తప్పుకోగా, ఆ బాధ్యతను కంగనా స్వీకరించింది. ఇదే ఇప్పుడు క్రిష్‌కి తంటా తెచ్చిపెట్టింది. సినిమా విడుదలయ్యాక కూడా విమర్శలూ, వివాదాలు వదలలేదు 'మణికర్ణిక'కు. దర్శకుడిగా క్రిష్‌కి దక్కాల్సిన గౌరవం దక్కకపోవడంతో సోషల్‌ మీడియా వేదికగా క్రిష్‌ పలు రకాల కామెంట్స్‌ చేస్తున్నారు.

ఈ కామెంట్స్‌కి కొందరు క్రిష్‌కి సపోర్ట్‌ చేస్తుండగా, మరికొందరు కంగనానే సపోర్ట్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, మెగాస్టార్‌ చిరంజీవి 'మణికర్ణిక' సినిమా చూసి, కంగనాని ప్రశంసలతో ముంచెత్తేశారు. సమంత తదితరులు కంగనా పర్‌ఫామెన్స్‌కి ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇలాంటి సినిమాలు హిట్టా.? ఫట్టా.? అని మాట్లాడుకోవడం కన్నా, తెరపై ఎలా ఆవిష్కరించారనే విషయాన్ని మాత్రమే కీలకంగా భావించాలి. ఆ విషయంలో 'మణికర్ణిక' మార్కులు కొట్టేసింది. వీరనారి లక్ష్మీ భాయ్‌ పాత్రలో తెరపై యుద్ధ సన్నివేశాల్లో కంగనా పోరాడిన తీరుకు ఆమెను ప్రతీ ఒక్కరూ మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

మరిన్ని సినిమా కబుర్లు
Three Padma Award recipients