Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

niharika naughty treat in suryakantam teaser

niharika naughty treat in suryakantam teaser

2019 సంవత్సరానికి బంపర్‌ హిట్‌ ఇచ్చాడు 'ఎఫ్‌ 2' సినిమాతో వరుణ్‌తేజ్‌. అదే ఉత్సాహంతో తదుపరి సినిమా 'వాల్మీకి'ని అనౌన్స్‌ చేసేశాడు. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా 14 రీల్స్‌ బ్యానర్‌లో రూపొందనుంది. మరోవైపు 'ఎఫ్‌ 2' జోరు ఇంకా తగ్గనేలేదు. మూడు వారాలుగా వసూళ్ల పంట పండిస్తూనే ఉంది. ఇప్పటికే 70 కోట్లు వసూలు చేసిన 'ఎఫ్‌ 2' 100 కోట్లు దిశగా పరుగులు తీస్తోంది. ఇదిలా ఉంటే, మరోవైపు మెగా డాటర్‌ నిహారిక కూడా జోరు ప్రదర్శిస్తోంది. నిహారిక మూడో సినిమా 'సూర్యకాంతం' టీజర్‌ విడుదలైంది. టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

 

గయ్యాలీ గాళ్‌ఫ్రెండ్‌గా నిహారిక తన పర్‌ఫామెన్స్‌తో ఆకట్టుకోనుంది ఈ సినిమాతో. హీరోయిన్‌గా తొలి రెండు సినిమాలతో నిరాశపరిచిన నిహారికకు 'సూర్యకాంతం' టైలర్‌ మేడ్‌ క్యారెక్టర్‌ కానుంది. ఫుల్‌ ఫ్లెడ్జ్‌డ్‌ ఫన్‌ ఈ సినిమాలో ఉండబోతోందని టీజర్‌తో చెప్పకనే చెప్పేశారు చిత్ర యూనిట్‌. అస్సలు సీరియస్‌నెస్‌ లేకుండా, ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతోంది. సూర్యకాంతం క్యారెక్టర్‌లో నిహారిక చక్కగా ఒదిగిపోయినట్లు టీజర్‌లో చూపించారు. టీజర్‌ అంతా నిహారిక నాటీ ట్రీట్‌తో అదిరిపోయింది. ఈ సారి నిహారిక హిట్‌ కొట్టడం పక్కా అని టీజర్‌తోనే కన్‌ఫామ్‌ అయిపోయింది.

మరిన్ని సినిమా కబుర్లు
Krish - Kangana: wrong.