Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Krish - Kangana: wrong.

ఈ సంచికలో >> సినిమా >>

సినీ వాకిట్లో విరిసిన 'పద్మాలు'.!

Three Padma Award recipients

దేశంలో అత్యున్నత పౌర పురస్కారాలుగా భావించే పద్మ అవార్డులు ఈ ఏడాది సినీ పరిశ్రమలో ముగ్గురు ప్రముఖుల్ని వరించాయి. అందులో ఒకరు ఇండియాలోనే టాప్‌ డాన్స్‌ కొరియోగ్రాఫర్‌ అయిన ప్రభుదేవా కాగా, మరొకరు పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఇంకొకరు మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌. డాన్స్‌ కొరియోగ్రాఫర్‌గా సినీ పరిశ్రమకు సంబంధించి ఆయన చేసిన సేవలకుగాను ప్రభుదేవాకి పద్మశ్రీ పురస్కారం దక్కింది. డాన్స్‌ కొరియోగ్రాఫర్‌గానే కాకుండా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగుతో పాటు, ఇతర భాషల్లోనూ ప్రభుదేవా సత్తా చాటారు. చాటుతూనే ఉన్నారు. పాటల రచయితగా ఇన్నేళ్ల కెరీర్‌లో వేల సంఖ్యలో అద్భుతమైన పాటల్ని అందించిన సిరివెన్నెల సీతారామశాస్త్రిని పద్మశ్రీ వరించింది.

సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న ఆహ్లాదమైన సంగీతంతో పాటు, సమాజానికి ఇన్‌స్పైరింగ్‌ పాటల్నెన్నో అందించిన సిరివెన్నెల పాటల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఇక ముచ్చటగా మూడో అవార్డు మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌కి దక్కింది. పద్మభూషణ్‌ అవార్డు మోహన్‌లాల్‌ని వరించింది. మలయాళంలో సూపర్‌ స్టార్‌ అయినప్పటికీ, తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించారు మోహన్‌లాల్‌. అప్పుడెప్పుడో 'గాంఢీవం' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మోహన్‌లాల్‌ ఇటీవల ఎన్టీఆర్‌తో 'జనతా గ్యారేజ్‌' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించారు. తర్వాత 'మనమంతా' సినిమాలో నటించారు. ఇలా ఈ పద్మ పురస్కార గ్రహీతలు ముగ్గురూ తెలుగు సినిమాకు సుపరిచితులు కావడం విశేషం.

మరిన్ని సినిమా కబుర్లు
'When will he