Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

'రౌడీ'తో ప్రేమలో పడ్డ బబ్లీ 'ఎమ్మెల్యే'.!

Babli 'MLA' in love with 'Rowdy'

సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ ఇంతవరకూ ఒక్క భామతోనే ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేశాడు. కానీ ఈ సారి కొంచెం కొత్తగా ముగ్గురు భామలతో ఆన్‌స్క్రీన్‌ రొమాన్స్‌కి సిద్ధమయ్యాడు. వారెవరో కాదు రాశీఖన్నా, ఐశ్వర్యారాజేష్‌, ఇసాబెల్లే. ఇంతకీ ఏ సినిమా కోసమంటారా.? 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' తదితర సినిమాతో డిఫరెంట్‌ రొమాంటిక్‌ మూవీస్‌ని తెరకెక్కించిన క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ ఓ సినిమాకి సైన్‌ చేశాడు. ఆ సినిమా కోసమే ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు ఎంపికయ్యారు. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో ముగ్గురే కాదు, నలుగురు భామలనీ లేటెస్ట్‌గా న్యూస్‌ వచ్చింది.

ఆ నాలుగో భామ ఇంకెవరో కాదు, కేథరీన్‌. కేథరీన్‌ అంటే లవ్‌లీ ఏంజెల్‌. 'సరైనోడు' సినిమాలో లేడీ ఎమ్యెల్యేగా నటించి, బన్నీకే కాదు, అందరికీ లవ్‌లీ ఏంజెల్‌ అయిపోయింది. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించినా, సోలో హీరోయిన్‌గా సక్సెస్‌ కాలేకపోయింది. కానీ ఉన్నంతలో సెకండ్‌ హీరోయిన్‌ అయినా, తన పాత్రకు ప్రాధాన్యత ఉండేలా చూసుకుంది. ఇకపోతే విజయ్‌ దేవరకొండ సినిమాలోనూ ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ కోస కేథరీన్‌ని ఎంచుకున్నారు. అసలే విజయ్‌ దేవరకొండ క్రేజ్‌ మామూలుగా లేదు. ఈ సినిమా సక్సెస్‌ అయితే కేథరీన్‌తో పాటు ఈ క్రేజీ స్టార్‌తో జత కట్టిన ముగ్గురు ముద్దుగుమ్మలూ సక్సెస్‌ దక్కించుకోవడం ఖాయమే. డిఫరెంట్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ 'డియర్‌ కామ్రేడ్‌' సినిమాతో బిజీగా ఉన్నాడు. కేథరీన్‌ తమిళంలో 'నియా 2' సినిమాలో ఇచ్ఛాధారి నాగిని పాత్రలో నటిస్తోంది. 

మరిన్ని సినిమా కబుర్లు
Ramudu' in humility.