Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Ramudu' in humility.

ఈ సంచికలో >> సినిమా >>

రామ్‌ మరీ ఇంత ఇస్మార్ట్‌ అయిపోయాడేంటీ.!

ram too smart

ఎప్పుడయితే పూరీ జగన్నాధ్‌ సినిమాలో హీరోగా ఎంపికయ్యాడో ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ ఎనర్జీ పదింతలైపోయింది. ఈ సినిమాకి 'ఇస్మార్ట్‌ శంకర్‌' అనే టైటిల్‌ ఫిక్స్‌ చేసిన నాటి నుండీ, రామ్‌ ఇస్మార్ట్‌గా ఆలోచించడం మొదలెట్టేశాడు. ప్రతీ విషయంలోనూ ఇస్మార్ట్‌ అనిపించుకునేలా తన ఆటిట్యూడ్‌ని మార్చేసుకున్నాడు. అసలు విషయం ఏంటంటే, రామ్‌ పూరీ జగన్నాధ్‌కి ఓ సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్‌ ఇచ్చి శభాష్‌ అనిపించుకున్నాడు అదేంటంటారా.? కాఫీ గింజల ప్యాకెట్‌. అదేంటీ కాఫీ గింజల ప్యాకెట్‌ గిప్ట్‌గా ఇస్తే ఇస్మార్ట్‌ ఏంటీ, హాట్‌ టాపిక్‌ అవ్వడమేంటీ అనుకునేరేమో. అవునండీ ఆ కాఫీ రేట్‌ ఎంతో తెలిస్తే దిమాక్‌ ఖరాబ్‌ ఐతది మరి.

వరల్డ్‌లోనే అత్యంత ఖరీదైన కాఫీ అది. కోపీ లువాక్‌ అనే ఈ కాఫీ గింజల్ని ఇండోనేషియాలో ఎక్కువగా పండిస్తారు. ఖరీదెంతో తెలుసా.? ఒక్క కప్పు కాఫీ దాదాదపు 35 డాలర్ల నుండి, 80 డాలర్ల వరకూ ఉంటుందట. అంత కాస్ట్‌లీ కాఫీని పూరీకి గిఫ్ట్‌గా ఇచ్చాడు మరి రామ్‌. రామ్‌ ఇస్మార్టేగా. నో డౌట్‌. ఇక లేటెస్ట్‌గా ఇస్మార్ట్‌ శంకర్‌ మూవీ స్టార్ట్‌ అయిన సంగతి తెలిసిందే. నిధి అగర్వాల్‌, నభా నటేష్‌ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రఫ్‌ లుక్‌లో, రగ్గ్‌డ్‌ క్యారెక్టర్‌లో రామ్‌ నటిస్తున్నాడు. ఎందుకో ఈ సినిమా విషయంలో రామ్‌ మరీ ఎక్కువ ఆశలు పెట్టేసుకున్నాడనిపిస్తోంది. స్టార్టింగ్‌ డే నుండే సినిమాపై హైప్‌ పెరిగేలా ఏదో ఒక మ్యాజిక్‌ చేస్తూనే ఉన్నాడు మన ఇస్మార్ట్‌ శంకర్‌ అదేనండీ రామ్‌.

మరిన్ని సినిమా కబుర్లు
How do you do so?