Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
How do you do so?

ఈ సంచికలో >> సినిమా >>

మహానాయకుడికి బోయపాటి ఇన్‌పుట్స్‌

boyapati inputs

ఎన్టీఆర్‌ బయోపిక్‌గా తెరకెక్కిన 'కథానాయకుడు' అసలెందుకు ఫెయిల్యూర్‌గా నిలిచిందో ఇంకా అర్ధం కావడం లేదు చాలామందికి. ఇదిలా ఉంటే, ఈ సినిమా ఫెయిల్యూర్‌తో సెకండ్‌ పార్ట్‌ 'మహానాయకుడు' పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 'కథానాయకుడు' డిస్ట్రిబ్యూటర్స్‌కే 'మహానాయకుడు'ను ఫ్రీగా ఇచ్చేసినా ఈ సినిమాని విడుదల చేసే పరిస్థితి కనిపించడం లేదు. వరసగా రిలీజ్‌ డేట్‌ని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ఇదిలా ఉంటే, 'మహానాయకుడు' సినిమా 'కథానాయకుడు' రిలీజ్‌ టైంకే దాదాపు పూర్తైపోయింది. మిగిలి ఉన్న కాస్తో కూస్తో షూటింగ్‌ని పూర్తి చేసి, ఇన్‌టైంలో విడుదల చేసేద్దామనుకుంటే, కథానాయకుడు ఫ్లాప్‌తో చిత్రయూనిట్‌ సందిగ్ధంలో పడిపోయింది. దాంతో రీషూట్స్‌ జరుగుతున్నాయంటూ వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో గాసిప్‌ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకి బోయపాటి ఇన్‌పుట్స్‌ ఇస్తున్నారంటూ గాసిప్‌ చక్కర్లు కొడుతోంది. అయితే విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారట. ప్యాచ్‌ వర్క్‌కి సంబంధించి క్రిష్‌, బాలయ్య బోయపాటి సలహాలు తీసుకుంటున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. బోయపాటి సెట్స్‌లోకి వెళ్లకుండా బయటి నుండే ఇన్‌పుట్స్‌ ఇస్తున్నాడట. అయితే ఇది కేవలం గాసిప్పేనా, లేక ఒకవేళ నిజమే అయితే ఈ గాసిప్‌లో నిజమెంతో తెలుసుకోవాలని ప్రయత్నించినా కష్టమే కదా సుమీ. 

మరిన్ని సినిమా కబుర్లు
This 'Padmasri' ... all of them!