Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Babli 'MLA' in love with 'Rowdy'

ఈ సంచికలో >> సినిమా >>

వినయంలో 'రాముడు' అనిపించుకున్నాడు.!

Ramudu' in humility.

'వినయ విధేయ రామ' సినిమా ఫలితంపై చరణ్‌ తాజాగా ఓ ప్రకటన విడుదల చేశాడు. 'రేయింబవళ్లు ఈ సినిమా కోసం యూనిట్‌ మొత్తం కష్టపడి పని చేశాం. కానీ దురదృష్టవశాత్తూ రిజల్ట్‌ ఆశించిన విధంగా రాలేదు. మాపై నమ్మకంతో ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు, డెడికేటెడ్‌గా వర్క్‌ చేసిన వినయ విధేయ రామ టీమ్‌ మొత్తానికీ ధన్యవాదాలు తెలిపాడు. అలాగే మీడియా మిత్రులకూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు చరణ్‌. అభిమానులను ఆశించిన విధంగా ఎంటర్‌టైన్‌ చేయగలిగే సినిమాని అందించడం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను..' అని చరణ్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా మా సినిమా ఇంత పెద్ద హిట్‌ అయ్యింది. అన్ని వసూళ్లు కొల్లగొట్టేసిందీ అంటూ లెక్కలు చూపడం ప్యాషన్‌ అయిపోయిందిప్పుడు దర్శక, నిర్మాతలకు. ఇలాంటి తరుణంలో చరణ్‌ ఇంత జెన్యూన్‌గా తన సినిమా పరాజయం పాలైంది అంటూ వినమ్రంగా పేర్కొనడం ఆయనలోని వినయ విధేయతలకు సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. చరణ్‌ చేసిన ఈ ప్రకటనకు అభిమానులు ఆయన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. తదుపరి చరణ్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్‌, చరణ్‌ మధ్య కీలక సన్నివేశాల చిత్రీకరణ ఈ షెడ్యూల్‌లో జరుగుతోంది. 

మరిన్ని సినిమా కబుర్లు
ram too smart