Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' ఇదీ అసలు కథ.!

Laxmis NTR is the original story.

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ చెప్పింది చేశాడు. 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' ట్రైలర్‌ రిలీజ్‌ చేశాడు. ట్రైలర్‌లోనే సినిమా కథ మొత్తం చెప్పేశాడు. చాలా పాత్రల్ని ట్రైలర్‌లో చూపించాడు. డైలాగులతో కట్టి పారేశాడు. టోటల్‌ సినిమాని కొన్ని నిముషాల ట్రైలర్‌లోనే చూపించేసినట్లుంది. ట్రైలర్‌లోనే ఇంత చూపిస్తే, ఇక సినిమాలో ఇంకేం చూపించేస్తాడో వర్మ అని ఈ సినిమాపై ఆశక్తి మరింత పెరిగిపోయింది. ఎన్టీఆర్‌ పాత్ర కోసం తీసుకున్న నటుడు విజయ్‌, ఎన్టీఆర్‌ పాత్రలో పరకాయ ప్రవేశం చేసేశాడు.

లక్ష్మీపార్వతి పాత్రలో యజ్ఞాశెట్టి అచ్చు గుద్దినట్టు సెట్‌ అయ్యింది. కథ విషయానికి వస్తే ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎంటర్‌ అయ్యాక ఆయన జీవితంలో జరిగే పరిణామాల్ని వాస్తవానికి దగ్గరగా అత్యంత ఎమోషనల్‌గా కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారనీ 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' ట్రైలర్‌ చూస్తుంటే అర్ధమవుతోంది. విశ్వ విఖ్యాత నట సార్వభౌముడిగా, రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా మన్ననలు పొందిన ఎన్టీఆర్‌ చివరి రోజుల్లో అనుభవించిన అత్యంత దీన స్థితిని, నరక యాతనను ఈ సినిమా ద్వారా వర్మ చూపిస్తున్నాడు. ట్రైలర్‌లో ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఇలా చాలా పాత్రలు చూపించేశాడు. ముఖ్యంగా చంద్రబాబు పాత్రను విలన్‌గా చూపించాడు వర్మ. మరి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఈ సినిమా ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలిక. మరోవైపు విడుదలైన కొన్ని గంటల నుండే యూట్యూబ్‌లో సంచలనం సృష్టించడం మొదలుపెట్టేసింది 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' ట్రైలర్‌. 

మరిన్ని సినిమా కబుర్లు
churaka