Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
pracheena saahitya darshanam book review

ఈ సంచికలో >> శీర్షికలు >>

అదృష్టం - బన్ను

adrushtam

ఎవరైనా ఏదన్నా సాధించినా, పైకొచ్చినా వాడి అదృష్టం బాగుందిరా... అనటం మనకి అలవాటై పోయింది. అంతే గానీ, వాడెంత కష్టపడి పైకొచ్చాడో ఎవరూ ఆలోచించట్లేదు.

మనం మానవ ప్రయత్నం మానేసి... నాకు అదృష్టం లేదనుకోవటం తప్పు అని నా ఉద్దేశ్యం. మనకు అనువైన రీతిలో, నానా తంటాలు పడో శత విధాలా ప్రయత్నిద్దాం. ఐనా ఫలితం రాకపోతే అప్పుడు మనకి అదృష్టం బాగోలేదని భావిద్దాం!

పడిపోయి లేచిన కంపెనీలెన్నో ఉన్నాయి. దానికి 'ఆపిల్' ఉదాహరణ! 'చచ్చింది... కంపెనీ' అన్నవాళ్ళ నోర్లు మూయించాడు 'స్టీవ్ జాబ్స్'! ఆపిల్ 'IPOD' తో లేచి 'I Phone' తో ప్రపంచాన్నే ఆకర్షించిందా కంపెనీ. ప్రస్తుతం 'NOKIA' ని అలా అంటున్నారు. రేపు ఏమి జరుగుతుందో మనం ఊహించగలమా? ఊహించగలిగితే మనం దేవుడితో సమానమే!

అదృష్టం ఎవరిసొత్తూ కాదు. ప్రయత్నిస్తే అదృష్టం మన వెంటే వుంటుంది. శ్రద్ధా, భక్తులతో ప్రయత్నిద్దాం... అదృష్టం మన వశమవుతుంది.

"చేత కాని తనముంటే నీలో....జాతకాన్ని నిందించకు" అన్న డా|| సి. నారాయణ రెడ్డి గారి ద్విపద పంక్తిలో ఉన్న ఆంతర్యం ఇదే.

GOOD LUCK!

మరిన్ని శీర్షికలు
temples and rituals