Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
telisina varitho lavadeveelu

ఈ సంచికలో >> శీర్షికలు >>

వార ఫలం (నవంబర్ 08 - నవంబర్ 14) - శ్రీకాంత్

మేష రాశి
ఈవారం మీరు శుక్రవారం కుటుంబ పరంగా నూతన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన మేలు జరుగుతుంది. మీరున్న ప్రదేశంలో కాకుండా మరొక ప్రదేశమునకు వెల్లు అవకాశం ఉంది నిదానంగా వ్యవహరించుట మంచిది. శని, ఆదివారాల్లో పనులలో ఆశించిన లాభంను పొందుటకు అవకాశం ఉంది. కావున పెద్దల ఆలోచనలను అమలుచేయుట ద్వారా గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది. బంధువుల యెడల ప్రీతిని కలిగి ఉంటారు. వారికి సమయాన్ని కేటాయించే అవకాశం ఉంది. సోమ, మంగళవారాల్లో బంధువుల గృహంలో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది, సరదాగా సమయాన్ని వారితో గడుపుటకు అవకాశం ఉంది. ఆర్థికముగా ధనము విషయంలో ఆశించిన విధంగా లాభంను పొందుతారు. బుధ, గురువారాల్లో పనుల ఒత్తిడిని పొందుటకు అవకాశం ఉంది, చేపట్టిన పనుల మూలాన శారీరక శ్రమను కలిగి ఉంటారు. చేపట్టిన పనులకోసం అధిక మొత్తంగా ధనమును ఖర్చు చేయు అవకాశాలు కలవు. వారంమొత్తంమీద కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొంతవరకు ఆందోళన కలిగించే అవకాశం కలదు. కావున తగిన జాగ్రత్తలు పాటించుట మంచిది. పనులలో ఉత్సాహంను కోల్పోయే అవకాశం ఉంది. కావున సరైన ప్రణాళికతో ముందుకు వెళ్ళండి. సమయానికి భోజనం చేయుటవలన మేలు జరుగుతుంది. అధికారులతో ఇబ్బందులు తప్పకపోవచ్చును, కావున చేయుపనుల పట్ల శ్రద్ద అవసరం. కలహముల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. గురువుల యెడల భక్తిని కలిగి ఉంటారు. ఆచార, వ్యహారాల విషయంలో శ్రద్ధను చూపిస్తారు.   

వృషభ రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించుట వలన మేలుజరుగుతుంది. సమయానికి భోజనం చేయుట వలన మేలు జరుగుతుంది. మోకాళ్ళ నొప్పుల మూలాన ఇబ్బందులు తప్పక పోవచ్చును. శని, ఆదివారాల్లో సంతానం మూలాన కొంత ఇబ్బందులు పొందుటకు అవకాశం ఉంది. కావున వారికి సంబంధించిన విషయాల్లో బాగా ఆచితూచి నిర్ణయం తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. సోమ, మంగళ వారాల్లో కొంత ఆశాజనకమైన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. పెద్దలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం మూలాన తప్పక విజయంను పొందుటకు అవకాశం ఉంది. మిత్రులను కలిసే అవకాశం ఉంది. వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. బుధ, గురువారాల్లో భోజనంవిషయంలో ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉంటారు. ఆర్థిక పరమైన విషయాల్లో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. నూతన అవకశాలు కలుగుతాయి వాటి మూలాన సంతోషంను పొందుతారు. వారం మొత్తం మీద తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం కలదు. కాకపోతే అధికమైన పని ఒత్తిడిని కలిగి ఉండకుండా చూసుకోవడం ముఖ్యం. ధనమునకు సంబంధించిన విషయంలో నూతన అవకాశాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ద చేయకండి. సరైన జాగ్రత్తలు చేపట్టుట వలన మేలు జరుగుతుంది. వినోదములలో పాల్గొనే అవకాశం ఉంది. వాటికి సమయాన్ని కేటాయిస్తారు. చర్చల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. ధార్మిక సంబంధమైన విషయాల్లో సమయాన్ని గడుపుతారు. పెద్దలను కలుస్తారు. వారికి అనుకూలమైన పనులను చేపడుతారు. వాటిమూలన లాభంను పొందుతారు. 

మిథున రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున ధనము విషయంలో ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. చేపట్టిన పనుల విషయంలో ఆశించిన ఫలితాలు కలుగుటకు అవకాశం ఉంది. ప్రయత్నాలలో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. శని, ఆదివారాల్లో స్వల్ప అనారోగ్య సమస్యలు పొందుటకు అవకాశం ఉంది తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవడం మూలాన మేలుజరుగుతుంది. సమయానికి భోజనం చేయుట ఉత్తమం . మంచి ఆహారాన్ని తీసుకోండి. సోమ, మంగళ వారాల్లో మీరుతీసుకొనే నిర్ణయాలు కుటుంబసభ్యులను ఇబ్బందిపెట్టె అవకాశం ఉంది.  కావున అందరిని సంప్రదించి తీసుకోండి నిర్ణయాలను మేలుచేస్తుంది. అకారణంగా కలహములు కలుగుటకు అవకాశం ఉంది.  నిదానంగా వ్యవహరించుట మంచిది. బుధ, గురువారాల్లో తలపెట్టిన పనులను సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. అధికారులకు అనుగుణంగా పనులను చేపట్టుట మూలాన వారితో గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది. ఇష్టమైన పనులను చేపట్టి వాటిని విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. వారంమొత్తంమీద బంధుమిత్రులతో కలిసి చేపట్టిన పనుల మూలాన ధనము వ్యయం అయ్యే అవకాశం కలదు. నిర్ణయాలు తీసుకొనే విషయంలో తడబాటును కలిగి ఉండే అవకాశం ఉంది. ఇష్టమైన వారి నుండి నూతన విషయాలు తెలిసే అవకాశం ఉంది. విభేదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి మంచిది. అనుకోని విభేదాలు కలిగే అవకాశం ఉంది. చేయు వృత్తిలో సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది.  నిదానంగా వ్యవహరించుట మేలు. కోపంను కలిగి ఉండకపోతే తప్పక మేలు జరుగుతుంది.

కర్కాటక రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున కుటుంబంలో సంతోషంగా గడుపుతారు. విందులు, వినోదములలో పాల్గొనే అవకాశం కలదు.  వాటికి సమయాన్ని కేటాయించే అవకాశం ఉంది. ఇతరులకు సేవ చేయాలనే తలంపును కలిగి ఉంటారు.  మీ ఆలోచనలు వారికి ఉపయోగపడే అవకాశం ఉంది. శని, ఆదివారాల్లో ఆర్థిక పరమైన విషయాల్లో నూతన అవకాశాలు కలుగుటకు అవకాశం ఉంది. నలుగురిని కలుపుకొని పనులను చేపట్టాలనే ఆలోచన కలిగి ఉంటారు.  కాకపోతే సరైన ప్రణాళిక అవసరం. స్త్రీ/పురుష సౌఖ్యంను పొందుటకు అవకాశం ఉంది. పనులలో అనవసరపు హడావుడిని తగ్గించుకొనే ప్రయత్నం చేయండి. సోమ, మంగళ వారాల్లో అనారోగ్య సమస్యల మూలాన ఇబ్బందులు తప్పక పోవచ్చును. సమయానికి భోజనం చేయుట వలన మేలు జరుగుతుంది. ప్రయాణాలు చేయకపోవడం వలన మంచి జరుగుతుంది వాయిదా వేసుకోండి. బుధ, గురువారాల్లో కుటుంబంలో కొంత నిరాశను పొందుతారు.  మీయొక్క ఆలోచనలను వ్యతిరేకించే అవకాశం ఉంది.  కావున సర్దుకుపొండి. ప్రతి పనిని ఒకటికి రెండుసార్లు ఆలోచించి మొదలు పెట్టండి. వారం మొత్తం మీద తలపెట్టిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు పొందుటకు అవకాశం ఉంది.  కావున నూతన ప్రయత్నలకన్నా గతంలో చేపట్టిన పనులను పూర్తిచేసే ప్రయత్నం ఉత్తమం. ప్రయాణాలు వాయిదా వేయుట వలన కొంతమేర ఇబ్బందులు తగ్గుటకు అవకాశం ఉంది. స్నేహితుల మూలాన ఇబ్బందికరమైన పరిస్థితులు కలుగుటకు అవకాశం ఉంది.  కావున చెడు స్నేహాల పట్ల జాగ్రత్తగా మెలగండి. మాత్రు సంబంధమైన విషయాల్లో కొంత సంతోషాన్ని పొందుటకు అవకాశం ఉంది. ప్రయాణాల మూలాన శ్రమను పొందుతారు. పనులలో కూడా ఒత్తిడిని కలిగి ఉండే అవకాశం ఉంది. భోజనం విషయంలో మీవైన ఇష్టాలను చూపించే అవకాశం ఉంది.  
  

సింహ రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున ఒకవార్త కొంత ఆందోళనకు గురిచేసే అవకాశం ఉంది. పనులలో నిదానం అవసరం.  ఒకటికి రెండు సార్లు ఆలోచించి పనులను చేపట్టుట మూలాన మేలుజరుగుతుంది. పనులను మధ్యలో ఆపవలసి రావచ్చును. ఆరోగ్యం విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు అవసరం. శని, ఆదివారాల్లో పనులలో ముందుకు వెళ్ళుటకు అవకాశం కలదు. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంతమేర పర్వాలేదు అన్నవిధంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. నూతన అవకాశాలు కలుగుటకు ఆస్కారం ఉంది. సోమ, మంగళవారాల్లో ధనాదాయం బాగుంటుంది.  చేపట్టిన పనులలో ఇతరుల సహకారం మూలాన ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. కుటుంబసభ్యులతో సమయాన్ని గడుపుతారు. బంధుమిత్రులను కలిసే అవకాశం ఉంది వారికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. బుధ, గురువవారాల్లో నలుగురిలో చేపట్టిన పనులలో ముందుకు వెల్లు అవకాశం కలదు, కాకపోతే ఆరోగ్యపరమైన ఇబ్బందులు తప్పక పోవచ్చును . కావున జాగ్రత్త అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో అనుకోని ఖర్చును పొందుటకు అవకాశం ఉంది. వారం మొత్తం మీద ఉత్సాహంను కలిగి ఉండి నూతన పనులను మొదలు పెట్టుట యందు ఆసక్తిని కలిగి ఉంటారు. బంధువులను కలుస్తారు వారితో కలిసి సమయాన్ని మీకనుకూలంగా గడిపే అవకాశం ఉంది. తలపెట్టిన పనులలో ఓ మోస్తారు విజయంను పొందుటకు అవకాశం ఉంది. ఎవ్వరితోను మాట పట్టింపులకు పోకపోవడం ఉత్తమం. ప్రతిపనిలో నిదానం అవసరం. క్రయ, విక్రయముల మూలాన లాభంను పొందు అవకాశం ఉంది. ధార్మిక సంబంధమైన విషయాల్లో తప్పనిసరిగా ఒకింత లాభం ఉంటుంది. ఉద్యోగంలో కొంత మెరుగుదల కనబడుతుంది. భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు.

 

కన్యా రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున కుటుంబంలో అందరిని కలుపుకొని వెళ్ళు ప్రయత్నం చేయండి మంచిది. పనులలో ఒకింత ఆలస్యంగా ముందుకు వెళ్ళుట మూలాన ఆందోళన చెందుటకు ఆస్కారం కలదు. బంధుమిత్రులతో మాటపట్టింపులు పొందుటకు అవకాశం ఉంది. కావున మాటలను పొదుపుగా వాడుట వలన మేలుజరుగుతుంది. శని, ఆదివారాల్లో అశుభవార్తను వినే అవకాశం కలదు.  మానసికంగా దృడంగా ఉండుట సూచన. ఆరోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. కావున తగిన జాగ్రత్తలు పాటించుట వలన మేలు జరుగుతుంది. సోమ, మంగళవారాల్లో పనులలో ముందుకు వెళ్తారు.  ఆశించిన లాభంను పొందుటకు అవకాశం ఉంది. నూతన పనులను చేపట్టుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకశాలు కలుగుటకు అవకాశం ఉంది. కుటుంబంలో వచ్చు మార్పులు సంతోషాన్ని కలిగించే విధంగా ఉండుటకు అవకాశం ఉంది. ఇతరులకు సహాయం చేయుటకు అవకాశం ఉంది మీవలన తోటివారు లబ్దిని పొందుతారు. బుధ, గురువారాల్లో నలుగురిలో గుర్తింపును పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు లాభంను కలిగించేవిధంగా ఉండుటకు ఆస్కారం కలదు. విందులు, వినొదములలొ పాల్గొనే అవకాశం కలదు. ఉద్యోగంలో నూతన అవకాశాలు కలిసివచ్చే ఆస్కారం కలదు. వారంమొత్తం మీద చేయువ్రుత్తిలో కొంత ధనము వ్యయం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనే ప్రయత్నం చేయండి మంచిది. నూతన నిర్ణయాలు తీసుకొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. దూరప్రదేశాల నుండి అనుకూలమైన అవకాశం కలుగుతుంది. అనవసరమైన సంచారం చేయుటకు అవకాశం ఉంది. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది. కుటుంబసభ్యులతో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో పనిఒత్తిడిని కలిగి ఉంటారు నిదానంగా వ్యవహరించుట మంచిది.

తులా రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున నచ్చినవారిని కల్సుకొనే అవకాశం కలదు వారితో మీ ఆలోచనలను పంచుకొనే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో అవకాశాలు కలుగుటకు అవకాశం ఉంది ప్రయత్నం చేయుట ఉత్తమం. మనోదైర్యంను కలిగిఉండి పనులలో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. శని, ఆదివారాల్లో పనులలో జాప్యం వచ్చుటకు అవకాశం కలదు. తొందరపాటు పనికిరాదు చేపట్టిన పనులలో ఆందోళన చెందుటకు అవకాశం ఉంది. ప్రతివిషయాన్ని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి తప్పక మేలుజరుగుతుంది. సోమ, మంగళవారాల్లో అనారోగ్యసమస్యలు తప్పక పోవచ్చును కావున జాగ్రత్త. సాధ్యమైనంత వరకు నూతన పనులను చేపట్టకపోవడం మూలాన తప్పక మేలుజరుగుతుంది. బంధుమిత్రులతో మాటపట్టిపులకు పోకపోవడం ఉత్తమం. బుధ, గురువారాల్లో బాగుటుంది అనుకున్న పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. నూతన అవకాశాల కోసం చేయు ప్రయత్నాలు కలిసి వస్తాయి. వారంమొత్తం మీద ఆరోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. తగిన జాగ్రత్తలు చేపట్టుట వలన మేలుజరుగుతుంది. అకారణంగా కలహములు కలుగుటకు అవకాశం కలదు నిదానంగా వ్యవహరించుట వలన తప్పక మేలుజరుగుతుంది. సమయానికి భోజనం చేయుట మంచిది. నూతనవస్త్ర ప్రాప్తిని కలిగి ఉంటారు. ఆశించిన ఫలితాలు రావడానికి శ్రమను కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది. సమయానికి భోజనం చేయండి. పెద్దల సూచనలు సలహాలను పాటించే ప్రయత్నం చేయండి ఉత్తమం. వ్యతిరేకవర్గం ఇబ్బందులు తప్పక పోవచ్చును సర్దుకుపొండి.


వృశ్చిక రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున మాటలను పొదుపుగా వాడుట మూలాన మేలుజరుగుతుంది. స్థానచలనం కలుగుటకు అవకాశం ఉంది. ఆప్తులఆరోగ్యం కొంత భాధకు గురిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నిదానంగా వ్యహరించుట మేలుచేస్తుంది. శని, ఆదివారాల్లో నూతన పనులను చేపడుతారు. ఆర్థికపరమైన విషయాల్లో కొత్త కొత్త అవకశాలు కలుగుటకు అవకాశం ఉంది. బంధువులను కలుస్తారు వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. నూతన వస్త్ర లబహంను కలుగుటకు అవకాశం ఉంది. సరదాలకు సమయాన్ని కేటాయిస్తారు. సోమ, మంగళవారాల్లో దూరప్రదేశాల నుండి విన్న వార్తల మూలాన కొంత ఆందోళన చెందుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు ఆరంభించక పోవడం మంచిది. బుధ, గురువారాల్లో ధనమునకు సంబంధించిన విషయాల్లో నిదానంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల మూలాన ఇబ్బందులు తప్పక పోవచ్చును. అనారోగ్యసమస్యలు కలుగుటకు ఆక్సరం కలదు. వారంమొత్తం మీద అధికమైన ప్రయాణాలు చేయుట మూలాన శ్రమకు గురయ్యే అవకాశం కలదు. అనుకోని ఖర్చులను పొందుటకు అవకాశం కలదు. నూతన పనుల విషయంలో నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సమయానికి భోజనం చేయండి , అల్పాహారానికి ప్రాముఖ్యతను ఇచ్చే అవకాశం ఉంది. అకారణంగా మీమటలను వాడక పోవడం ఉత్తమం. ఖర్చును అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయండి ఉత్తమం. నూతన పరిచయాల మూలాన కొత్త విషయాలు తెలుసుకొనే ఆస్కారం కలదు వారితో కలిసి సమయన్ని గడుపుతారు.


ధనస్సు రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు. ఉత్సాహంను కలిగి ఉండి నూతన పనులను చేపడుతారు. రాజకీయ వ్యవహారాల విషయంలో శ్రద్ధను చూపిస్తారు. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగుటుంది సంతృప్తిని కలిగి ఉంటారు. శని, ఆదివారాల్లో మాటలను పొదుపుగా వాడుట వలన మేలుజరుగుతుంది. పనులపైన అధికమైన శ్రద్ధను చూపుట వలన కొంతమేర పనులు ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. పెద్దలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోండి మంచిది. సోమ, మంగళవారాల్లో ఇష్టమైన వారిని కలుస్తారు వారికి సమయాన్ని ఇచ్చుటకు అవకాశం ఉంది. నచ్చిన పనులకు సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. ఉద్యోగంలో బాగుటుంది. రాజకీయ వ్యవహరాల్లో కలిసి వస్తుంది. బుధ, గురువారాల్లో తలపెట్టిన పనులలో ఆటంకాలు కలుగుటకు అవకాశం ఉంది కావున నిదానంగా వ్యవహరించుట ఉత్తమం. బంధువులతో మాటపట్టింపులు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త. వారంమొత్తం మీద అధికారులతో మీకున్న మంచి సంబంధాల మూలాన తప్పక మేలును పొందుతారు. నూతన అవకాశాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. మధురపదార్థముల విషయంలో ఆసక్తిని కలిగి ఉంటారు. శరీరసౌఖ్యంకు ప్రధాన్యతిస్తారు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ద వద్దు అలాగే ప్రయాణాల విషయంలో బాగాఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆర్థికపరమైన విషయాల్లో కొంత లాభంను పొందుతారు శ్రమతప్పక పోవచ్చును. ఇష్టమైన ఒక పనిని పూర్తిచేసే అవకాశం ఉంది. రాజాకేయాలలో రానిన్చాలనే కోరిక బలపడుతుంది. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది.

మకర రాశి

ఈవారం మీరు శుక్రవారం రోజున అధికమైన ఆలోచనలు చేస్తారు వాటిని అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయుట వలన తప్పక మేలుజరుగుతుంది. అనుకోని ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త. ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకండి ముఖ్యంగా బంధువులతో నిదానంగా వ్యవహరించుట మంచిది. శని, ఆదివారాల్లో భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు. నూతన వ్యక్తులతో కలిసి కొత్త పనులను చేపట్టు అవకాశం కలదు. ఉత్సాహంను కలిగి ఉండి పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుటుంది. శరీరసౌఖ్యంకు ప్రాముఖ్యతను ఇస్తారు. సోమ, మంగళవారాల్లో మాటలను పొదుపుగా వాడుట వలన మేలుజరుగుతుంది. వ్యాపారంలో మాత్రం నిదానంగా వ్యవహరించట వలన తప్పక మేలుజరుగుతుంది. ధనమునకు సంబంధించిన విషయాల్లో మాత్రం నిదానం అవసరం అనుకోని ఖర్చులు కలుగుతాయి. బుధ, గురువారాల్లో ఇష్టమైన వారిని కలుస్తారు వారి మూలాన నూతన అవకశాలు కలుగుతాయి. నూతనవస్త్ర లాభంను కలిగి ఉంటారు. కుటుంబంలో సంతోషంగా గడుపుటకు అవకాశం ఉంది. మిత్రులను కలుస్తారు వారితో కలిసి సమయన్ని గడుపుటకు అవకాశం ఉంది. వారంమొత్తం మీద ఉద్యోగంలో నూతన అవకశాలు కలుగుటకు ఆస్కారం కలదు. అధికారుల మూలాన లబ్దిని పొందుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో మేలుజరుగుతుంది. బంధుమిత్రులను కలుస్తారు వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. భోజనం విషయంలో మీకున్న ఆసక్తులకు అనుగుణంగా ఆలోచన చేస్తారు. తరచూప్రయానములు చేయుట వలన అలుపు ఉండుటకు అవకాశం ఉంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు కలుగుటకు అవకాశం కలదు బుద్దిబలంతో మంచినిర్ణయాలు తీసుకోండి. వివాదములు కలుగుటకు అవకాశం ఉంది శాంతంగా ఉండుటకు ప్రయత్నం చేయండి. అధికారుల మూలాన తిప్పలు తప్పకపోవచ్చును. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూడటం మంచిది.


కుంభ రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున బంధువులను కలుస్తారు వారితో సమయాన్ని గడుపుతారు, చర్చలు జరుగుటకు అవకాశం ఉంది కొంత సర్దుబాటు విధానం మంచిది. భోజనం సమయానికి చేస్తారు సౌఖ్యంను కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయల్లో పర్వాలేదు అన్నవిధంగా ఉండుటకు అవకాశం కలదు. తీపిపదార్తముల విషయంలో ఇస్టంను కలిగి ఉంటారు. శని, ఆదివారాల్లో ఆలోచనలు పెరుగుటకు అవకాశం ఉంది వాటిని అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయుట వలన మేలుజరుగుతుంది. ధనమునకు సంబంధించిన విషయాల్లో అనుకోని ఖర్చును పొందుతారు. ఊహించిన దానికన్నా అధికమైన ఖర్చు కలుగుతుంది. బంధుమిత్రులతో మాటపట్టింపులు కలుగుటకు అవకాశం ఉంది కావున నిదానంగా వ్యవహరించుట సూచన. సోమ, మంగలవా రాలలో ధనమునకు ప్రాముఖ్యతను ఇస్తారు వాటికోసం చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి అదేవిధంగా ఖర్చు విషయంలో అదుపు అవసరం. నూతన పరిచయాల కోసం చేయు ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. సంతోశంను కలిగి ఉండి కొత్త కొత్త ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. బుధ, గురువారాల్లో మాటలను పొదుపుగా వాడుట మూలాన మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు కూడదు. ఖర్చులు కలుగుతాయి. బంధువులతో మనస్పర్థలు కలుగుటకు అవకాశం ఉంది. వారంమొత్తం మీద అనవసరపు ఖర్చును పొందుటకు అవకాశం కలదు జాగ్రత్త. ఆర్థికపరమైన విషయల్లో నూతన నిర్ణయాలు చేయకండి కొంతకాలం ఆగడం మంచిది. అపరాధబావం మొదలవుటకు అవకాశం ఉంది నిదానంగా వ్యవహరించుట సూచన. కుటుంబంలో సర్దుకుపొండి అందరిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. కొంత నిరుత్సాహంను పొందుటకు అవకాశం ఉంది. యత్నిత కార్యములయందు విజయంను పొందుటకు అవకాశం ఉంది.

మీన రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున ఉద్యోగంలో అందరిని కలుపుకొని వెళ్ళుట మూలాన మేలుజరుగుతుంది. నూతన ప్రయత్నాలు కలిసివస్తాయి. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు కలుగుటకు అవకాశం ఉంది. బంధువులను కలుస్తారు వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. భోజనం విషయంలో ప్రత్యేకమైన శ్రద్దను కలిగి ఉంటారు, విందులలో పాల్గొనే అవకాశం ఉంది. శని, ఆదివారాల్లో బంధువుల గృహంలో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో లాభంను పొందుతారు. నచ్చిన పనుల కోసం సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. మానసికంగా దృడంగా ఉండుట మేలుచేస్తుంది. ఉద్యోగంలో అధికారులతో మీ ఆలోచనలను పంచుకుంటారు వారి మూలాన లబ్దిని పొందుటకు అవకాశం ఉంది. సోమ, మంగళవారాల్లో ఆలోచనలు పెరుగుటకు అవకాశం ఉంది. అనుకోని ఖర్చులు కలుగుతాయి. ప్రయాణాల మూలాన ఖర్చులు పొందుతారు. బంధుమిత్రులతో మాటపట్టింపులకు పోకండి వారి ఆలోచనలు అనుమతిని ఇవ్వడం చేత మంచిజరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించుట వలన మేలుజరుగుతుంది. బుధ, గురువారాల్లో నూతన పరిచయాలు అలుగుటకు అవకాశం కలదు. అధికారులకు అనుగుణంగా నడుచుకుంటారు. ఆశించిన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. వారంమొత్తం మీద పనిభారంను కలిగి ఉంటారు పనులలో శ్రమను పొందుటకు అవకాశం ఉంది. శత్రువుల మూలాన ఇబ్బందులు పొందుటకు అవకాశం ఉంది చుసిచూడనట్లు నడుచుకోవడం మూలాన మేలుజరుగుతుంది. ఒకవార్తకొంత వరకు భాదను కలిగించే అవకాశం కలదు. నూతన పనులను ఆరంభించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుట మంచిది. ఇతరులకు సేవచేయాలనే ఆలోచన కలిగి ఉంటారు. మిత్రులతో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది.

శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
Lesson by Indian king to rolls royce