Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

అంచనాలు పెంచేస్తోన్న చై,శామ్‌ 'మజిలీ'

chai, sam majil

రియల్‌ లైఫ్‌ దంపతులు నాగచైతన్య, సమంతలు రీల్‌ లైఫ్‌ దంపతుల్లా నటిస్తున్న చిత్రం 'మజిలీ'. ప్రస్తుతం చైతూ టైం ఏమంత బాగోలేకున్నా, సమంతకు మాత్రం గుడ్‌ టైం నడుస్తోంది. సమంత ఏ సినిమా చేసినా అది హిట్టే. సో అలా 'మజిలీ'పై అంచనాలు పెరిగాయి. టీజర్‌ వచ్చాక ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. ఏప్రిల్‌ 5న 'మజిలీ' ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలో ప్రమోషన్స్‌ షురూ చేయనున్నారట చిత్ర యూనిట్‌. 'నిన్ను కోరి' ఫేం శివ నిర్వాణ ఈ సినిమాకి దర్శకుడు. కాగా సమంత ఈ సినిమాలో ఓ సాధారణ గృహిణి పాత్రలో పర్‌ఫామెన్స్‌ బేస్‌డ్‌ రోల్‌ పోషిస్తోంది. చైతూ క్రికెటర్‌గా కనిపించనున్నాడు. మరో ముద్దుగుమ్మ దివ్యాంశ కౌశిక్‌ ఈ సినిమాలో ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, దివ్యాంశ కౌశిక్‌తో చైతూకి లిప్‌లాక్‌ సీన్‌ ఉన్నట్లు టీజర్‌లో చూపించారు.

ఈ సీన్‌పై ఈ మధ్య సమంతకు కొన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అందుకు సమంత చాలా పోజిటివ్‌గా స్పందిస్తోంది. అదంతా నటనలో భాగమే అంటూ చాలా లైట్‌ తీసుకుంటోంది. ఆన్‌ స్క్రీన్‌ హగ్గులూ, కిస్సింగ్‌లు అంతా నాటకమే. కానీ నిజం కాదు అని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. 'రంగస్థలం' సినిమా టైంలో రామ్‌చరణ్‌తో లిప్‌లాక్‌ విషయంలోనూ సమంత ఇలాగే స్పందించింది. అది జస్ట్‌ కెమెరా ట్రిక్‌ మాత్రమే అని వివరణ ఇచ్చింది. ఇదిలా ఉంటే, గతేడాది 'రంగస్థలం'తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టి, తర్వాత వరుస విజయాలను సొంతం చేసుకున్న సమంత ఈ ఏడాది హబ్బీతో కలిసి 'మజిలీ'తో బోణీ కొట్టనుంది. 

మరిన్ని సినిమా కబుర్లు
suspence in RRR