Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chai, sam majil

ఈ సంచికలో >> సినిమా >>

ఆర్‌ఆర్‌ఆర్‌'లో అదొక్కటే సస్పెన్స్‌.!

suspence in RRR

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో జక్కన్న తెరకెక్కిస్తున్న భారీ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌'కి సంబంధించి అన్ని విషయాలూ తేటతెల్లం చేసేశాడు రాజమౌళి. అనౌన్స్‌మెంట్‌ రోజు నుండీ ఈ సినిమాకి సంబంధించి రకరకాల గాసిప్స్‌ చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు గాసిప్స్‌కి అస్సలు చోటే లేకుండా అంతా క్లారిఫై చేసేశాడు రాజమౌళి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా చరణ్‌, తెలంగాణా సాయుధ పోరాట యోధుడు కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తున్నారనీ వారి పాత్రల పేర్లతో పాటు ఇంపార్టెంట్‌ డీటెయిల్స్‌ కూడా ఇచ్చేశాడు. బాలీవుడ్‌ భామ అలియాభట్‌, విదేశీ భామ డైసీని హీరోయిన్లుగా సెలెక్ట్‌ చేశాడు. బ్రిటీష్‌ కాలం నాటి కథని తనదైన స్టైల్‌లో ఫిక్షన్‌ స్టోరీగా 'ఆర్‌ఆర్‌ఆర్‌'ని తెరకెక్కించబోతున్నామనీ చెప్పాడు. బడ్జెట్‌ లెక్కలు కూడా ముందే చెప్పేశారు.

దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోందని నిర్మాత దానయ్య తెలిపారు. ఇక బాలీవుడ్‌ నుండి ప్రముఖ నటుడు అజయ్‌దేవగణ్‌ని ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ కోసం ఎంచుకున్నారీ సినిమా కోసం. తెలుగుతో పాటు దాదాపు అన్ని భాషల్లోనూ ఈ సినిమాని విడుదల చేయనున్నారు. ఆల్రెడీ రెండు షెడ్యూల్స్‌ కంప్లీట్‌ చేసుకున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌'ని జూలై 30, 2020 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామనీ రిలీజ్‌ డేట్‌ కూడా అనౌన్స్‌ చేసేశారు రాజమౌళి. ఇదంతా తెలిసిన విషయమే. అయితే 'ఆర్‌ఆర్‌ఆర్‌' అసలు టైటిల్‌ ఏంటీ.? అంటే ఆ ఒక్క ఛాన్స్‌ మాత్రం ఫ్యాన్స్‌కే వదిలేశాడు. అన్ని భాషల్లోనూ 'ఆర్‌ఆర్‌ఆర్‌' కామన్‌గా ఉంటుందట. కానీ వాటి మీనింగ్స్‌ డిఫరెంట్‌గా ఉంటాయట. అవేంటో ప్రస్తుతానికి సస్పెన్సే మరి. అదీ సంగతి. 

మరిన్ని సినిమా కబుర్లు
netizens angry