యంగ్ హీరో నితిన్ కొంతకాలంగా 'భీష్మ' సినిమాని పెండింగ్‌లో పెట్టాడు. డైరెక్టరున్నాడు, హీరోయిన్ ఖరారైంది. కానీ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. నెలలు గడిచిపోతున్నాయ్ కానీ, 'భీష్మ' సినిమాపై నితిన్ అప్‌డేట్ ఇవ్వకపోవడం అతని అభిమానుల్ని నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులోపు అన్ని విషయాలపై క్లారిటీ ఇస్తానని నితిన్ చెప్పాడు ట్విట్టర్ ద్వారా. అన్న మాట ప్రకారం నితిన్ తన కొత్త సినిమాపై అప్‌డేట్ ఇచ్చాడు. అది చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చేయబోయే కొత్త సినిమా గురించిన అప్‌డేట్. ఆగస్ట్‌లో ఈ సినిమా ప్రారంభమవుతుంది. దీంతో పాటుగా ఇంకో సినిమా అప్‌డేట్ కూడా వచ్చింది. రమేష్ వర్మ దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే ఇది ఎప్పుడు ప్రారంభమవుతుందనేది తెలియరాలేదు. మరోపక్క ఈ నెలాఖరులోపు 'భీష్మ' సినిమా ప్రారంభం కాబోతోందనే ప్రచారం అయితే జరుగుతోంది. ఈ మూడు సినిమాలే కాదు.
ఇంకోటి కూడా లైన్‌లో ఉంది. దర్శకుడు కొండా విజయ్‌కుమార్. 'గుండె జారి గల్లంతయ్యిందే'కి సీక్వెల్ చేయనున్నాడట. నితిన్ కూడా ఈ ప్రాజెక్టుపై సానుకూలంగా ఉన్నాడట. అన్నీ కుదిరితే దీనిపై అఫీషియల్ అప్‌డేట్ కూడా త్వరలోనే రావచ్చు. అయితే లిస్టు బాగానే ఉంది కానీ అంత ఈజీ కాదు వరుస ప్రాజెక్టుల్ని లైన్‌లోకి తీసుకురావడం.
|