'ఛలో' సినిమాతో ఎంట్రీ ఇచ్చి, తొలి సినిమాకే మంచి విజయం తన ఖాతాలో వేసుకున్న బ్యూటీ రష్మికా మండన్నా. 'గీత గోవిందం' సినిమాతో సంచలన విజయాన్ని అందుకుని సెన్సేషనల్ హీరోయిన్ అయిపోయింది. సోషల్ మీడియాలో రష్మికాకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ఇప్పుడా క్రేజ్‌కి డ్యామేజీ వచ్చి పడేలా ఉంది. ప్రస్తుతం రష్మికా 'డియర్ కామ్రేడ్' చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన 'డియర్ కామ్రేడ్' టీజర్‌లో హీరో విజయ్ దేవరకొండతో రష్మికా గాఢమైన లిప్‌లాక్ సీన్ ఒకటి చూపించారు. ఏదో కెమెరా ట్రిక్‌లా కాకుండా, రియలిస్టిక్‌గా రష్మికా ఆ లిప్‌లాక్ సీనులో కనిపించే సరికి తనను ఎంతగానో అభిమానించే నెటిజన్లు విమర్శలతో గుమ్మెత్తిపోస్తున్నారు.
ఈ లిప్‌లాక్ చూశాక, నువ్వంటే అసహ్యం వేస్తోందంటూ కొందరు నెటిజన్లు రష్మికాపై గుస్సా అవుతున్నారు. ఆల్రెడీ అంత క్రేజ్ ఉంది కదా. ఎందుకింత దిగజారిపోవాలి.. అని ఇంకొందరు మండి పడుతున్నారు. ఇలా ఒక్కరేంటీ. చాలా మంది నుండి నెగిటివ్ రెస్పాన్స్ వస్తోంది రష్మికాకి. ఈ రెస్పాన్స్ రష్మికా ఎక్స్‌పెక్ట్ చేయనిది. టీజర్‌కే ఇలాంటి రెస్పాన్స్ వస్తే ఇక సినిమా పరిస్థితేంటీ.? మరోవైపు విజయ్ దేవరకొండకున్న క్రేజ్‌తో ఇంతవరకూ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అసలిప్పుడు అంచనాలకే కేరాఫ్ అడ్రస్ అయిన లిప్‌లాక్ రష్మికాకి రివర్స్ కొట్టిందేంటబ్బా.!
|