ఒకప్పుడు యంగ్ హీరోలకు ఫస్ట్ ది బెస్ట్ ఆప్షన్‌గా ఉన్న రకుల్ ప్రీత్‌సింగ్ ఇప్పుడు సీనియర్ హీరోలతో రొమాన్స్‌కి దిగుతోంది. ఇటు టాలీవుడ్‌లోనూ, అటు బాలీవుడ్‌లోనూ కూడా రకుల్ రొమాన్స్ సీనియర్ హీరోలతోనే కావడం ఆశ్చర్యకరం. మొన్నీ మధ్య ఎన్టీఆర్ బయోపిక్‌లో నందమూరి బాలయ్యతో శ్రీదేవి పాత్రే అయినా కానీ, సీనియర్ హీరోతో ఆడిపాడింది. లేటెస్ట్‌గా నాగార్జునకు జోడీగా మారింది 'మన్మధుడు 2' కోసం. ఇక బాలీవుడ్ విషయానికొస్తే, సీనియర్ హీరోతో పాటు, కాన్సెప్ట్ వైజ్ కూడా 50 ఏళ్ల వ్యక్తితో శృతిమించి రొమాన్స్ చేసేస్తోంది. అదే 'దే దే ప్యార్ దే' సినిమా కోసం. అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రకుల్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది. భార్యతో విడిపోయిన ఓ 50 ఏళ్ల వ్యక్తి ప్రేమలో పడి, ఆ వ్యక్తితో భీభత్సంగా రొమాన్స్ పండించేస్తోంది.
వెరీ లేటెస్ట్‌గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌లో రకుల్ ఘాటు రొమాంటిక్ సీన్ షాట్స్ నెటిజన్స్‌ని విస్మయపరుస్తున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకుని టాలీవుడ్‌లో స్టార్‌డమ్ సైతం పక్కన పెట్టేసి బాలీవుడ్‌కి చెక్కేసిన రకుల్‌ని సీనియర్ హీరోలకి జోడీగా వాడుతున్నారు. ఇటు టాలీవుడ్‌కీ కాక, అటు బాలీవుడ్‌లో సరైన అవకాశం దొరక్క తికమకపడుతున్న రకుల్ ప్రీత్‌సింగ్ ఇక భవిష్యత్తులో సీనియర్ హీరోలకే ఫిక్సవ్వాల్సి వస్తుందా.? యంగ్ హీరోలతో ఆడి పాడే ఛాన్స్ దక్కించుకోవడం కష్టమేనా.? ఏమో చూడాలి మరి.
|