మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ స్వల్పంగా గాయపడ్డారు. గాయం కారణంగా మూడు వారాలు రెస్ట్ తీసుకోమని వైద్యులు సూచించారు. ఈ మేరకు మూడు వారాల పాటు 'ఆర్‌ఆర్‌ఆర్' షూటింగ్ వాయిదా వేస్తున్నామని చిత్ర యూనిట్ ప్రకటించింది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ 'ఆర్‌ఆర్‌ఆర్'కి సంబంధించి లేటెస్ట్ షూటింగ్ షెడ్యూల్ గుజరాత్‌లోని వడోదరలో జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్‌కి సంబంధించి కొన్ని లీకేజీ వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మొన్నా మధ్య ఫస్ట్ షెడ్యూల్‌కి సంబంధించి కొన్ని ఫోటోలు, వీడియోలు లీకైన సంగతి తెలిసిందే. తాజా లీకేజీ విషయానికొస్తే, బస్‌లో నుండి దిగిన ఎన్టీఆర్‌కి బైక్‌లో వచ్చి చరణ్ లిఫ్ట్ ఇస్తున్న వీడియో ఇది. ఇలా ఈ వీడియో లీకవ్వగానే, ఇటు చరణ్ ఫ్యాన్స్, అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వరుసపెట్టి ఆ వీడియోకు లైకులూ, షేరులూ కొట్టేశారు. దాంతో ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయిపోయింది.
ఇక వడోదర షూటింగ్ తర్వాత 'ఆర్‌ఆర్‌ఆర్' టీమ్ నెక్ట్స్ షెడ్యూల్ నిమిత్తం పూణేకు బయల్దేరాల్సి ఉంది. ఇంతలో చరణ్ కాలికి గాయం కావడంతో మూడు వారాల తర్వాతే షూటింగ్ కొనసాగించనున్నట్లు చిత్ర యూనిట్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ కాస్టింగ్‌తో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్‌దేవగణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. బాలీవుడ్ భామ అలియాభట్, చరణ్‌కి జోడీగా నటిస్తుండగా, విదేశీ భామ డైసీ ఎడ్గార్ జోన్స్, ఎన్టీఆర్‌తో జోడీ కడుతోంది. అన్ని భారతీయ భాషల్లోనూ విడుదల కానున్న 'ఆర్‌ఆర్‌ఆర్' 2020 జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
|