'ఆర్ ఎక్స్ 100' సినిమాతో కుర్రకారుకు గ్లామర్ గిలిగింతలు పెట్టిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్ పేరు ఇప్పుడు టాలీవుడ్‌లో తెగ మార్మోగిపోతోంది. తొలి సినిమా సంచలన విజయం అందుకోవడంతో పాటు, తర్వాత వరుస అవకాశాలు ఆమె చేతిలో వచ్చి వాలడంతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్లడానికి పాయల్‌కి ఇంకెంతో సమయం పట్టదనిపిస్తోంది. ఇదిలా ఉంటే, ఓ పక్క హీరోయిన్‌గా సత్తా చాటుతూనే, మరోపక్క తనకున్న క్రేజ్‌ని అప్పుడే స్పెషల్ సాంగ్స్ కోసమూ ఉపయోగించేస్తోందీ హాట్ బ్యూటీ. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతోన్న 'సీత' సినిమాలో పాయల్ రాజ్‌పుత్ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్‌కి సంబంధించిన లిరికల్ వీడియో తాజాగా రిలీజ్ చేసింది 'సీత' యూనిట్. 'బుల్ రెడ్డీ..' అంటూ సాగే ఈ పాటలో బుల్లెట్‌పై ఎంట్రీ ఇచ్చి పాయల్ రాజ్‌పుత్ చేసిన మాస్ సందడి అంతా ఇంతా కాదు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్‌లో లిరిక్స్ మాస్‌ని విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు, పాయల్ హాట్ హాట్ పెప్పీ స్టెప్పులు కెవ్వుకేక పుట్టించేస్తున్నాయి.
కామన్‌గా స్పెషల్ సాంగ్స్ అంటే హీరోతో పాటు చిందేయాలి. కానీ హీరో లేకుండా పాయల్ సోలో పర్‌ఫామెన్స్ ఇచ్చేసింది ఈ పాటలో. కాగా కాజల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా, తేజ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది 'సీత'. మరోవైపు పాయల్ రాజ్‌పుత్ 'వెంకీ మామ'లో వెంకటేష్‌తోనూ, 'డిస్కోరాజా'లో రవితేజతోనూ నటిస్తోంది. అన్నట్లు పాయల్ లీడ్ రోల్‌లో 'ఆర్‌డీఎక్స్' అనే హీరోయిన్ సెంట్రిక్ మూవీ లేటెస్ట్‌గా స్టార్ట్ అయ్యింది.
|