జయంతులు
ఏప్రిల్ 28
శ్రీ కాళ్ళకూరి నారాయణ రావు : వీరు ఏప్రిల్ 28, 1871 న, మత్స్యపురి లో జన్మించారు. ప్రముఖ నాటకకర్త, సంఘసంస్కర్త, ప్రథమాంధ్ర ప్రచురణ కర్త, జాతీయవాది, ఛాయా గ్రహణ వాద్యాదురంధరుడు, ‘మహాకవి’ బిరుదాంకితుడు. వీరు రచించిన “ చింతామణి” , “ వరవిక్రయం “, “ మధుసేవ “ నాటకములు , ఎంతో పేరు పొందాయి. ఇవే కాకుండా, పద్మవ్యూహం , సంసార నటన మొదలైన నాటకాలు, కారణంలేని కంగారు , దసరా తమాషాలు , లుబ్ధగ్రేసర చక్రవర్తి , రూపాయి గమ్మత్తు ఘోరకలి మునిసిపల్ ముచ్చట్లు , విదూషక కపటము వంటి ప్రహసనాలు రచించారు..
2 శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు : వీరు ఏప్రిల్ 28, 1897 న, ఆకివీడు లో జన్మించారు. ప్రముఖ రచయిత, నటుడు మరియు నాటక కర్త. హాస్య బ్రహ్మ అనే బిరుదు కూడా ఉంది. వీరు ఎక్కువగా నాటికలు ముఖ్యంగా హాస్య ప్రధానమైనవి రచించారు. ఆయన నాటికలకు చాలాభాగం ప్రముఖ ఫ్రెంచి నాటక కర్త మోలియర్ వ్రాసిన నాటికలు ఆధారం. ఆయన అనేక విషయాల మీద వ్రాసిన వ్యాసాలు 20వ శతాబ్దపు మొదటి అర్ధ భాగములోని సామజిక పరిస్థితులను తెలియచేస్తాయి.ఆయన హాస్యం చదువరికి చురుక్కుమనినిపిస్తుంది.ఈయన వ్రాసిన వ్యాసాలన్నీ కూడా హాస్య ప్రధానమైనపట్టికీ, వాటిలో విషయ పటిమ దృఢంగా ఉండి, విషయాలను మూలాలనుండి చర్చిస్తాయి.
ఏప్రిల్ 29
శ్రీ బంకుపల్లె నరసయ్య శాస్త్రి : వీరు ఏప్రిల్ 29, 1876 న , సింగుపురం లో జన్మించారు. వీరు ప్రముఖ పండితుడు, రచయిత, సంఘసంస్కర్త. వీరు తర్కశాస్త్రము, మంత్రశాస్త్రము, వేదాంత, మీమాంస శాస్త్రము లలో కూడా నిష్ణాతులు. వీరు సాంప్రదాయకుటుంబంలో జన్మించినప్పటికీ, హైందవసాంప్రదాయాలలోని మూఢాచారములను వ్యతిరేకించారు.
ఏప్రిల్ 30
శ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు : శ్రీశ్రీ గా ప్రసిధ్ధిచెందిన వీరు, ఏప్రిల్ 30, 1910 న, విశాఖపట్నం లో జన్మించారు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు. శ్రీశ్రీ హేతువాది మరియు నాస్తికుడు. మహాకవిగా శ్రీశ్రీ విస్తృతామోదం పొందారు.. మహాప్రస్థానం ఆయన రచించిన కావ్యాల్లో ప్రసిద్ధమైనది.
మే 1
- శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు : వీరు, మే 1, 1867 న ఎలకుర్రు లో జన్మించారు. పాత్రికేయుడు, వ్యాపారవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు, గ్రంథాలయాల విస్తరణకు కృషి చేసిన విద్యా వేత్త, దానశీలి . ఆంధ్ర పత్రిక, అమృతాంజనం సంస్థలను ఆయన స్థాపించారు.. ఆంధ్రపత్రిక, భారతి, ఆంధ్ర గ్రంథాలయాల ద్వారా తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసేరు.. ఆయన స్వయంగా రచయిత. భగవద్గీతకు వ్యాఖ్యానం రాసారు… “ దేశోధ్ధారక “ “ విశ్వదాత “ అని వారిని గౌరవించేవారు.
- శ్రీ పాకాల వెంకట రాజమన్నార్ : వీరు, మే 1 , 1901 న మద్రాస్ లో జన్మించారు. న్యాయవాది, పండితుడు, భారత రాజకీయనాయకుడు. 1948నుండి1961వరకు మద్రాసు రాష్ట్రపుఉన్నతన్యాయస్థానంలో ప్రధానన్యాయమూర్తిగా పనిచేశారు.
తెలుగు, ఇంగ్లీషు, సంస్కృతం, ఫ్రెంచి భాషలలో పాండిత్యం సంపాదించారు. తెలుగులో విప్లవాత్మక నాటకాలెన్నో వ్రాశారు. సమకాలీన నాటకరంగాన్ని, సాహిత్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించి విమర్శకునిగా కూడా పేరుతెచ్చుకున్నారు..
మే 2
శ్రీ పి. పుల్లయ్య : శ్రీ పోలుదాసు పుల్లయ్య, మే 2, 1911 న, నెల్లూరు లో జన్మించారు. మొదటి తరానికి చెందిన ప్రముఖ తెలుగు సినిమా దర్శక, నిర్మాత. “ పద్మశ్రీ” పతాకం కింద ఎన్నో తెలుగు, తమిళ చిత్రాలను నిర్మించారు.
వర్ధంతులు
ఏప్రిల్ 29
శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య : స్వాతంత్య్రోద్యమ కార్యకర్త. నాయకుడు. ప్రజాప్రతినిధి. వక్త. బహుగ్రంథకర్త. పద్మభూషణ్ పురస్కార గ్రహీత. ఖాదీ దుస్తులతో, చేతిలో ఖాదీ సంచితో నిరాడంబరంగా కనిపించే అజాతశత్రువు, . తన జీవిత కాలంలో పలు రచనలు చేసారు. తెలుగులో నలభై అయిదు, ఆంగ్లంలో పదహారు పుస్తకాలు రచించారు.
వీరు ఏప్రిల్ 29, 2003 న స్వర్గస్థులయారు.
|