Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
pratapabhavalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

26-04-2019 నుండి02-5-2019 వరకు వారఫలాలు - డా. టి. శ్రీకాంత్

మేష రాశి :   (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )

 ఈవారం కోపాన్ని తగ్గించుకోవడం వలన లబ్దిని పొందుతారు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. ఉద్యోగంలో అధికారులతో కలిసి నూతన ప్రయత్నాలు చేయుటకు ఆవకాశం ఉంది. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది, వాహనాల విషయంలో ఖర్చులు అయ్యే ఆస్కారం ఉంది. వ్యాపారరంగంలో నూతన పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు కలిసి వస్తాయి. జీవితభాగస్వామి నుండి పూర్తిగా సహకారం లభించుటకు అవకాశం ఉంది.

 


 వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)

ఈవారం పెద్దలను కలుస్తారు, వారి సూచనల మేర ముందుకు వెళ్ళండి. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేయుటకు ఆస్కారం ఉంది. జీవితభాగస్వామితో విభేదాలు రావడానికి ఆస్కారం ఉంది, జాగ్రత్త. పెద్దలతో మీకున్న పరిచయం వలన లబ్దిని పొందుతారు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వద్దు. అనుకోకుండా చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆత్మీయుల నుండి లేక మిత్రుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి. మానసికంగా దృడంగా ఉండుట సూచన. సంతానం విషయంలో నూతన నిర్ణయాలు తీసుకుంటారు.

 

 

మిథున రాశి :  (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)

ఈవారం సోదరులతో చేపట్టిన చర్చలను పూర్తిచేస్తారు,సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. నూతన వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. సంతానపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలకు ఆస్కారం ఉంది. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంశలు పొందుతారు. మిత్రులతో ఊహించని విధంగా విభేదాలు ఏర్పడే ఆస్కారం ఉంది, కావున కాస్త జాగ్రత్తగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది.

 

 

కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)

ఈవారం నూతన ప్రయత్నాల కన్నా గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట మంచిది. వ్యాపారపరమైన విషయంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. మిత్రులనుండి మీకు నూతన విషయాలు తెలుస్తాయి. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. ఖర్చులను తగ్గించుకోవడం వలన మేలుజరుగుతుంది. పెద్దలనుండి ముఖ్యమైన సహకారం లభిస్తుంది. విదేశీప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. విలువైన వస్తువులను నష్టపోయే ఆస్కారం కలదు , కావున కాస్త జాగ్రత్తగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది.

 

 

సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )

ఈవారం పెద్దలను కలుస్తారు, వారినుండి వచ్చిన సూచనల విషయంలో భిన్నమైన ఆలోచనలు కలిగి ఉంటారు. చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట మంచిది. మధ్యలో ఆగిన పనులను ముందుగా పూర్తిచేయుటకు ఆస్కారం ఉంది. రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుటకు అవకాశం కలదు. మిత్రులతో కలిసి సమాలోచనలు చేయుటకు అవకాశం ఉంది, వారి నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. సంతానం విషయంలో మీకున్న ఆందోళన తొలగుటకు అవకాశం ఉంది. కుటుంబసభ్యులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది.

 

 

కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )

 ఈవారం ముఖ్యమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుటకు ఆస్కారం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. మీ మాటతీరు వలన అధికారుల నుండి చక్కటి సహకారం లభిస్తుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. వ్యాపారపరమైన రంగాలలో నూతన అవకాశాలను పొందుతారు. సంతానపరమైన విషయాలలో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో అధికారుల నుండి వచ్చిన సూచనల మేర ముందుకు వెళ్ళండి. చర్చల్లో సర్దుబాటు విధానం మంచిది.

 

 

తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )

ఈవారం నూతన నిర్ణయాల విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. చేపట్టిన పనులను స్పష్టమైన ప్రణాళిక కలిగి ఉండుట వలన పూర్తిచేస్తారు. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడుటకు అవకాశం ఉంది. పెద్దలతో చర్చలు చేయకపోవడం మంచిది. వ్యాపారపరమైన విషయంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. మిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. మీ ఆలోచనల్లో కాస్త స్వల్ప మార్పుకు ఆస్కారం ఉంది. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. విదేశాల్లో ఉన్న మిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. వేచిచూసే ధోరణి మంచిది.

 

 

 
వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )

ఈవారం బంధువులను కలుస్తారు, వారితో కలిసి నూతన ప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులను చేపట్టుట వలన పెద్దలనుండి ప్రశంశలు పొందుతారు. అనుకోకుండా దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న బంధువుల నుండి ఆర్థికపరమైన విషయాల్లో ముఖ్యమైన సూచనలు వింటారు. ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు తప్పక పోవచ్చును, తండ్ర లేదా తండ్రితరుపు బంధువుల గురుంచి ఆలోచన చేయుటకు ఆస్కారం ఉంది. వివాదాలకు సాధయమైనంత  దూరంగా ఉండండి.

 

 


ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )

ఈవారం నూతన పరిచయాలకు అవకాశం ఉంది. సమయాన్ని సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు. గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. మిత్రులనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం ఉత్తమం. నూతన వ్యాపారపరమైన విషయాల్లో తొందరపాటు వద్దు , అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. జీవితభాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. చర్చల్లో అధికసమయం గడుపుటకు అవకాశం కలదు. కుటుంబంలో మీ ఆలోచనలను పెద్దలకు తెలియజేసే ప్రయత్నం చేస్తారు.

 

 

మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )

ఈవారం మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుతారు. చేపట్టిన పనుల వలన నలుగురిలో మంచి గుర్తింపును పొందుతారు. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వస్తారు. సామాజిక కార్యక్రమాల పట్ల మక్కువను చూపిస్తారు. అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది, సాధ్యమైనంత మేర వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. వ్యాపార పరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా వ్యహరించుట సూచన. వాహనాల వలన ఇబ్బందులు తప్పక పోవచ్చును. మానసికంగా దృడంగా ఉండుట వలన తప్పక మేలుజరుగుతుంది.  

 

కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )

ఈవారం నూతన ఆలోచనలను కలిగి ఉంటారు. కాస్త స్వార్థపూరితమైన ఆలోచనలను కలిగి ఉంటారు. చేపట్టిన పనుల వలన స్పష్టత కలిగి ఉండుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులు తప్పక పోవచ్చును. కుటుంబంలో ఇబ్బందులు కలుగుతాయి, నూతన విధానాలు కలిగి ఉంటారు. ప్రయాణాలు వాయిదా పడుతాయి. ఆరోగ్యపరమైన సమస్యలు పెరుగుటకు ఆస్కారం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. సోదరులతో మీరు చేపట్టిన చర్చలు మధ్యలో ఆగిపోయే ఆస్కారం ఉంది. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది, ఖర్చులు పెరుగుతాయి.
 

మీన రాశి :  (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )

 ఈవారం మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేయుటకు ఆస్కారం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే ఆస్కారం ఉంది. వ్యాపారపరమైన విషయంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. సోదరులనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం ఉత్తమం. వ్యాపారపరమైన విషయాల్లో కాస్త నిదానంగా వ్యవహరించుట పెట్టుబడుల విషయంలో తొందరపాటు కూడదు. ఆరోగ్యంలో కాస్త ఇబ్బందులు తగ్గుటకు ఆస్కారం కలదు.

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం

మరిన్ని శీర్షికలు
sarasadarahasam