Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Chinta Chiguru - Chicken

ఈ సంచికలో >> శీర్షికలు >>

సినీ సూత్రం: ఓడినోడిదే గెలుపు.! - ..

Cinematography

హీరో అవుదామనుకుని సినిమాల్లోకి వచ్చి, కమెడియన్‌గానో, విలన్‌గానో దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఆ తర్వాత తమ డ్రీమ్‌ అయిన హీరో క్యారెక్టర్‌లు సొంతం చేసుకున్న స్టార్లు ఎంతో మంది కనిపిస్తారు మనకు. కమెడియన్‌ సునీల్‌ నుండి, మెగాస్టార్‌ చిరంజీవి దాకా.. ఇలా ఎందరో కనిపిస్తారు. పాత కాలంలోనూ చాలా మంది స్టార్ల గురించి చెప్పుకోవడానికి ఇలాంటి కథలు చాలా కనిపిస్తాయి. గెలవడంలో ఏముందిరా.. కిక్కు.? ఒక్కసారి ఓడి చూడు, ఆ తర్వాత దొరికే గెలుపులో అసలు మజా ఏంటో తెలుస్తుంది.. అంటాడు ఓ మహానుభావుడు. ఓటమి నేర్పే పాఠం ఆస్వాదించగలిగితే అంత రుచిగా ఉంటుంది మరి. కాన్‌ఫ్లిక్ట్‌ సరిగ్గా లేకపోతే ఏ సినిమా కూడా సక్సెస్‌ అవ్వదు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో మూడు తెలుగు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాలు అందుకున్నాయి. తొలి విజయం 'మజిలీ'ది అయితే, రెండో విజయం 'చిత్రలహరి' ఖాతాలోకి వెళ్లింది. మూడో హిట్‌ 'జెర్సీ'కి దక్కింది. రెండు క్రికెట్‌ నేపథ్యం ఉన్న సినిమాలు, ఒకటి వేరే నేపథ్యం. అయితే మూడు సినిమాల్లోనూ యువతను ఆకట్టుకున్న అంశం ఒకటుంది. అదే జీవితంలో ఓడినోడు గెలవడం. ఒక రకంగా చెప్పాలంటే, ఇవి మూడూ ఫెయిల్యూర్‌ బేస్‌డ్‌ కథలు. అందులోంచి సక్సెస్‌ని చూడడం, యంగ్‌ తరంగ్‌కి బాగా నచ్చింది. అందుకే మూడు సినిమాల్నీ యువ ప్రేక్షకులు ఆదరించారు. ఆదరిస్తూనే ఉన్నారు.

ఇటీవల కాలంలో ఇంతలా యూత్‌ మెచ్చిన సినిమా ఇంకోటి లేదనడం అతిశయోక్తి కాదేమో. భీభత్సమైన రొమాన్స్‌, పొట్ట చెక్కలయ్యే కామెడీ ఇలాంటివేమీ ఈ మూడు సినిమాల్లోనూ లేవు. సింపుల్‌ లైఫ్‌, సింపుల్‌ నెరేషన్‌, బెస్ట్‌ పర్‌ఫామెన్సెస్‌.. ఇవే ఈ సినిమాల్ని విజయం వైపు నడిపించాయి. ఇంకో ఆశక్తికరమైన విసయమేంటంటే వరుస పరాజయాలతో తల్లడిల్లుతున్న నాగచైతన్య, సాయి ధరమ్‌తేజ్‌ ఈ సినిమాలతో ఊపిరి పీల్చుకున్నారు. నాని కూడా 'కృష్ణార్జున యుద్ధం' తర్వాత స్లో అయినా ఇప్పుడు జూలు విదిల్చాడు. గెలుపు ఎప్పుడూ మంచి కిక్‌ ఇస్తుంది. అయితే అంతకు మించి ఈ కథలు చూసే వాళ్లకి కిక్‌ ఇస్తున్నాయి. మళ్లీ మళ్లీ ఈ సినిమాల్ని జనం చూస్తున్నారంటే తమ జీవితాలకు ఈ సినిమాలు చాలా దగ్గరగా ఉండడమే కారణం. ఆశ క్యాన్సర్‌ని జయించేలా చేస్తుందంటాడు ఓ సినిమాలో హీరో. అది సినిమా డైలాగ్‌ మాత్రమే కాదు. జీవిత సత్యం కూడా. అందుకే ఓటమి ఎదురైతే సక్సెస్‌ కోసం కసితో కష్టపడాలి తప్ప, నైరాశ్యానికి గురి కాకూడదు.

మరిన్ని శీర్షికలు
jokes pancha ratnalu