Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

బన్నీ స్ట్రేటజీ అదుర్స్‌.!

Bunny Strategy Adurs

స్టైలిష్‌ స్టార్‌ బన్నీ తాజా చిత్రం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 24 నుండి స్టార్ట్‌ అయ్యింది. హైద్రాబాద్‌లో స్టార్ట్‌ అయిన బన్నీ సినిమా తొలి షెడ్యూల్‌ని వీలైనంత ఎర్లీగా కంప్లీట్‌ చేసేసి, నెక్స్ట్‌ షెడ్యూల్‌ ప్లాన్‌ చేయాలనుకుంటున్నారట. ఇంతవరకూ చాలా గ్యాప్‌ ఇచ్చినందున బన్నీ ఇక ఈ సినిమా విషయంలో అస్సలు ఆలస్యం చేయాలనుకోవడం లేదట. షెడ్యూల్‌కీ షెడ్యూల్‌కీ మధ్య గ్యాప్‌ కూడా తీసుకోకుండానే షూటింగ్‌లో పాల్గొనాలనుకుంటున్నాడట. అంటే అర్ధం చేసుకోవచ్చు ఈ సినిమా విషయంలో బన్నీ ఎంత తొందరగా ఉన్నాడో. త్రివిక్రమ్‌ కూడా అదే మూడ్‌లో ఉన్నాడట. ఆల్రెడీ తీసుకున్న ఈ గ్యాప్‌లోనే అన్ని షెడ్యూల్స్‌కి సంబంధించిన స్క్రిప్టు వర్క్‌ పక్కాగా సిద్ధం చేసి పెట్టేశాడట. ఇక చక చకా షూటింగ్‌ కంప్లీట్‌ చేసేసి, దసరాకే సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారట.

పూజాహెగ్దే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్‌ నటి టబు కీలక పాత్ర పోషిస్తోంది. తమన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు. హారికా హాసినీ క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో రూపొందుతోంది. ఇదిలా ఉంటే, బన్నీ తదుపరి చిత్రాలు కూడా లైన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. సుధీర్‌ వర్మతో ఓ సినిమాకీ, సుకుమార్‌తో మరో సినిమాకీ బన్నీ కమిట్‌ అయ్యాడు. సుధీర్‌వర్మ సినిమాకి 'ఐకాన్‌' అనే టైటిల్‌ కూడా అనౌన్స్‌ చేశాడు. ఈ ఏడాదిలోనే 'ఐకాన్‌'నీ పట్టాలెక్కించే యోచనలో బన్నీ ఉన్నట్లు తెలుస్తోంది. 

మరిన్ని సినిమా కబుర్లు
'Sita' dropped back