వెర్సటైల్ డైరెక్టర్ తేజ గతేడాది జూలైలోనే 'సీత' సినిమాని స్టార్ట్ చేశాడు. డిఫరెంట్ కాన్సెప్ట్‌గా 'సీత'ని రూపొందించబోతున్నాడు తేజ. 'చిత్రమ్', 'నువ్వునేను' వంటి లవ్ స్టోరీస్‌తో పాపులరైన తేజ చాన్నాళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో బౌన్స్ బ్యాక్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్‌తో ఏకంగా సీనియర్ హీరో బాలయ్యతో 'ఎన్టీఆర్' బయోపిక్ తెరకెక్కించే ఛాన్స్ దక్కించుకున్నాడు. కానీ పర్సనల్ కారణాలతో ఆ ప్రాజెక్టును మధ్యలోనే వదిలేశాడు తేజ. ఇకపోతే తేజ తాజా ప్రాజెక్ట్ 'సీత' విషయానికి వస్తే, 'సీత'లో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిచింది. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ నెల 24న 'సీత' ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ టెక్నికల్ రీజన్స్‌తో 'సీత' మేకి షిఫ్ట్ అయ్యింది.
మే లో విడుదల కాబోయే సినిమాలపై ఆల్రెడీ అంచనాలున్న సంగతి తెలిసిందే. నిఖిల్ 'అర్జున్ సురవరం' మే 1న విడుదల కానుంది. మే 9 'మహర్షి' డే. 'మహర్షి'పై ఉన్న హైప్ కారణంగా ఒకవేళ సూపర్ డూపర్ హిట్ అయ్యిందంటే, అది 'సీత'కు పెద్ద దెబ్బే అని చెప్పాలి. ఏది ఏమైనా 'సీత'ను మే 24న రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడట తేజ. మే 24 స్లాట్ అయితే ఖాళీగా ఉంది. కానీ ఆ స్లాట్ 'సీత'కు ఎంత మేర కలిసొస్తుందో చూడాలంటే లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇకపోతే ఈ సినిమాలో కాజల్‌కి జోడీగా బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్నాడు. కాజల్‌ది పవర్‌ఫుల్ పాత్ర. ఆల్రెడీ వచ్చిన 'సీత' ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అనూప్ అందించిన మ్యూజిక్ 'సీత'కు మరో ఆకర్షణ కానుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో 'సీత' రూపొందింది.
|