Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
'Sita' dropped back

ఈ సంచికలో >> సినిమా >>

'మహర్షి' హైప్‌ ఆకాశాన్నంటేస్తోంది.!

'Maharshi' hype is sky!

మే లో విడుదల కానున్న సినిమాల్లో పెద్దన్నలా వస్తున్నాడు సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు. మే 1న 'అర్జున్‌ సురవరం' సినిమాతో యంగ్‌ హీరో నిఖిల్‌ మే నెలకు బోణీ కొడుతుండగా, రెండో వారం అనగా మే 9న బాక్సాఫీస్‌ బద్దలుకొట్టేందుకు గ్రాండ్‌గా ధియేటర్స్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు 'మహర్షి'గా మహేష్‌బాబు. ఇంతవరకూ విడుదలైన నాలుగు ఆడియో సింగిల్స్‌ సినిమాపై అంచనాల్ని ఆకాశాన్నంటేలా చేసేశాయి. అయినా డైరెక్టర్‌ వైపు నుండి పలు అనుమానాలు వ్యక్తమవుతూ రకరకాల గాసిప్స్‌ చక్కర్లు కొడుతున్నాయి. కానీ అవేమీ పట్టించుకోవడం లేదు చిత్రయూనిట్‌. సినిమాకి సంబంధించిన ప్రతీ అప్‌డేట్‌నీ వంశీ పైడిపల్లి ట్విట్టర్‌ పేజ్‌ ద్వారానే షేర్‌ చేస్తున్నారు.

అంతేకాదు, 'మహర్షి' అప్‌డేట్‌ కోసం వంశీ పైడిపల్లి పేజీ ఓపెన్‌ చేయండి.. అంటూ లింక్‌ కూడా ఇస్తున్నారు. సో 'మహర్షి' యూనిట్‌కి వంశీ పైడిపల్లిపై ఎంత నమ్మకముందో ఇక్కడే తెలిసిపోతోంది. ఇక ఆడియో సింగిల్స్‌లో విడుదలైన మహేష్‌ స్టిల్స్‌ చూస్తుంటే, ఫ్యాన్స్‌కి ఉబలాటమస్సలు ఆగడం లేదు. అంతగా ఆ స్టిల్స్‌తో ఎట్రాక్ట్‌ చేస్తున్నాడు మహేష్‌బాబు. మోడ్రన్‌ రైతులా ప్యాంటు, షర్టు ధరించి, తలపాగా చుట్టి, నాగలి చేత పట్టి, వ్యవసాయం చేస్తున్న లేటెస్ట్‌ స్టిల్స్‌కి ఫ్యాన్స్‌ ఫిదా అయిపోతున్నారు. చూడాలి మరి ఇంతలా హైప్‌ పెంచేసిన 'మహర్షి' ఏం మ్యాజిక్‌ చేయబోతున్నాడో.

మరిన్ని సినిమా కబుర్లు
Tharakaratna made by new movie Shuru