సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రంగా తెరకెక్కుతోన్న 'మహర్షి' సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటేస్తున్నాయి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు దిగ్గజాలైన నిర్మాణ సంస్థలు ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో గ్రాండియర్ లుక్‌తో రూపొందించాయి. పోస్టర్లూ, ప్రచార చిత్రాలతో సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు. ట్రైలర్ వచ్చాక ఆ అంచనాలు నెక్ట్స్ లెవల్‌కి చేరాయి. మరి కొద్దిరోజులు మాత్రమే మిగిలి ఉంది 'మహర్షి' ధియేటర్స్‌లో సందడి చేయడానికి. ఇక అభిమానుల సందడి విషయానికి వస్తే, సోషల్ మీడియా వేదికగా 'మహర్షి'ని బీభత్సంగా ప్రమోట్ చేస్తున్నారు.
కాస్టింగ్ పరంగా, టెక్నీషియన్స్ పరంగా 'మహర్షి' రేంజే వేరు అనే రీతిలో ఉండడంతో ఈ సినిమాతో బాక్సాఫీస్ బద్దలుకావడం ఖాయమనీ ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. పూజాహెగ్దే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ దేవిశ్రీ అందించిన సంగీతం అందర్నీ ఉర్రూతలూగిస్తోంది. వీడియో ప్రోమోస్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సమ్మర్‌లో విడుదలైన ఓ మోస్తరు చిన్న సినిమాలు కూడా పోజిటివ్ టాక్‌తో మంచి సక్సెస్ అందుకున్నాయి. 'మహర్షి'కి అది కూడా మంచి సైనే అని చెప్పాలి. సమ్మర్‌లో పెద్ద సినిమాగా వస్తున్న 'మహర్షి' అంచనాల్ని అందుకుంటుందో లేదో చూడాలంటే, జస్ట్ వెయిట్ అండ్ సీ ఫర్ మే 9.
|