గ్లామర్ తారగా వెలుగొందిన ముద్దుగుమ్మ ప్రియమణి దాదాపు సౌత్ భాషల ప్రేక్షకులందరికీ సుపరిచితురాలే. కొన్ని హిందీ సినిమాల్లోనూ నటించింది. అయితే, ప్రస్తుతం సినిమాల్లో కనిపించడం లేదు. కానీ, లాంగ్ గ్యాప్ తర్వాత ఇటీవలే 'సిరివెన్నెల' అనే ఓ సినిమాకి సైన్ చేసింది. రెగ్యులర్ సినిమాల్లా కాదు, ఇదో ప్రత్యేకమైన చిత్రం. దీంతో పాటు, ప్రియమణికి మరో బంపర్ ఆఫర్ తగిలినట్లు తెలుస్తోంది. రానా హీరోగా నటిస్తున్న 'విరాటపర్వం' సినిమాలో ప్రియమణి కోసం ఓ పవర్‌ఫుల్ రోల్ సిద్ధమైందట. గ్లామర్‌తో పాటు, ప్రియమణి పర్‌ఫామెన్స్ కూడా ఇరగదీసేస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే ఈ స్పెషల్ రోల్ ఆమె కోసం వెతుక్కుంటూ వచ్చిందేమో. 90ల కాలం నాటి నక్సలిజం నేపథ్యంతో సాగే కథ 'విరాటపర్వం'. ఈ సినిమాలో బెల్లి లలిత అనే ఫోక్ సింగర్ పాత్రలో ప్రియమణి నటించనుందట. ఆ కాలంలో విప్లవ గాయనిగా తెలంగాణాలో మంచి పేరుంది బెల్లి లలితకు. 19 ఏళ్లకే విప్లవ గాయనిగా మారిన బెల్లి లలిత, తన పదునైన పాటలతో విప్లవంలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేసేదట..
అయితే గ్యాంగ్‌స్టర్ నయీం ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేసి, పోలీస్ స్టేషన్ ఎదుట పడేసినట్లు చరిత్ర చెబుతోంది. ఈ క్యారెక్టర్‌లోనే ప్రియమణి కనిపించబోతోందట. ఇలా రీ ఎంట్రీలో ప్రియమణి రెండు విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించేందుకు సిద్ధమవుతోంది. చూడాలి మరి, పర్‌ఫామెన్స్‌కి స్కోపున్న ఈ రెండు పాత్రలూ ప్రియమణిని మళ్లీ టాలీవుడ్‌లో బిజీ అయ్యేలా చేస్తాయేమో.
|