సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఆంధ్రప్రదేశ్‌లో తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ విడుదలై మంచి విజయం సాధించింది. ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకొచ్చిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్ర కథనం టీడీపీ శ్రేణులకు వ్యతిరేకంగా ఉందన్న కారణంతో, ఎలక్షన్స్ టైమ్‌లో విడుదల చేయద్దనీ ఎలక్షన్ కమీషన్ ఆంక్షల మేరకు ఈ సినిమా విడుదలను ఆంధ్రప్రదేశ్‌లో పోస్ట్‌పోన్ చేశారు.. అయితే పోలింగ్ పూర్తవడంతో మే 1న 'లక్ష్మీస్ ఎన్టీఆర్'ని ఏపీలో రిలీజ్ చేసేందుకు వర్మ అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ క్రమంలో విజయవాడలో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయగా, ఏపీ పోలీసులు దాన్ని అడ్డుకోవడంతో న్యాయ పోరాటానికి దిగారు వర్మ. ఏది ఏమైతేనేం, ఎంత ప్రయత్నించినా, ఏపీలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్'ని విడుదల చేయడం వర్మకు కత్తి మీద సామే అయ్యింది. మే 1 విడుదల తేదీ కూడా బెడిసికొట్టడంతో, సోషల్ మీడియా వేదికగా వర్మ పోరాటం సాగుతూనే ఉంది.
అయితే తాజాగా ఎలక్షన్ కమిటీ, అన్ని ప్రాంతాల్లోనూ ఎలక్షన్స్ పూర్తయ్యే వరకూ ఈ సినిమా విడుదల పోస్ట్‌పోన్ చేసుకోవల్సిందిగా మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. పరిస్థితి చూస్తుంటే, ఎలక్షన్స్ పూర్తయ్యి, మే 23న రిజల్ట్ వచ్చే వరకూ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కి ఇదే పరిస్థితి కొనసాగేలా ఉందనిపిస్తోంది. ఎలక్షన్ కమీషన్‌ని ఎదిరించి వర్మ ఈలోగా సినిమా విడుదల చేస్తారా.? లేక మే 23 వరకూ తన న్యాయ పోరాటాన్ని కొనసాగించాల్సిందేనా.? వేచి చూడాలిక.
|