Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Beauty is doing this.

ఈ సంచికలో >> సినిమా >>

సందీప్‌కిషన్‌ డబుల్‌ ధమాకా అదిరిందిలే!

double dhamma

యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడబోతున్నాయి. కొంచెం గ్యాప్‌లోనే రెండు సినిమాలూ పోటీకి దిగనున్నాయి. రెండు డిఫరెంట్‌ జోనర్‌ మూవీస్‌ అవి. ఒకటి 'తెనాలి రామక ష్ణ బి.ఎ.బి.ఎల్‌' కాగా, ఇంకోటి 'నిను వీడని నీడను నేను'. ఈ రెండు సినిమాలూ ఆశక్తికరంగానే ఉన్నాయి. రెండు సినిమాల ప్రచార చిత్రాలూ ఆకట్టుకుంటున్నాయి. 'తెనాలి రామక ష్ణ' ఫుల్‌ లెంగ్త్‌ ఫన్‌తో కూడిన కథ అయితే, 'నిను వీడని నీడను నేను' సినిమా మాత్రం హారర్‌ అండ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కింది. లేటెస్ట్‌గా రిలీజ్‌ చేసిన టీజర్‌ ఆశక్తికరంగా ఉంది. సినిమాలో సందీప్‌కిషన్‌కి ఏదో సమస్య ఉన్నట్లుగా ఉంది. అద్దంలో చూసుకుంటే, ఆయన నీడకి బదులు మరో వ్యక్తి నీడ కనిపిస్తుంటుంది. ఆ నీడ వెన్నెల కిషోర్‌ది. ఈ కాన్సెప్ట్‌ ఏదో ఆశక్తికరంగానే అనిపిస్తోంది. హీరో అన్యా సింగ్‌తో కెమిస్ట్రీ హాట్‌గా ఉంది. అదే సమయంలో హీరోయిన్‌ని హారర్‌ మూడ్‌లోనూ చూపించారు.

కార్తీక్‌ రాజు ఈ సినిమాకి దర్శకుడు. ఇక రెండో సినిమా 'తెనాలి రామక ష్ణ' విషయానికి వస్తే, ఈ సినిమాలో సందీప్‌ కిషన్‌ లాయర్‌ అని ఫస్ట్‌లుక్‌ ద్వారా అర్ధమవుతోంది. కేసులిప్పించండి బాబోయ్‌ అంటూ హీరో మొరపెట్టుకుంటున్నాడు. ఎంటర్‌టైనింగ్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. హన్సిక కథానాయిక. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలక పాత్ర పోషిస్తోంది. 

మరిన్ని సినిమా కబుర్లు
'Sita' difficulties for release