Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

ఛాలెంజింగ్‌ రోల్‌లో చరణ్‌ బ్రదర్‌.!

adi pinisetti in chalenging role

ఛాలెంజింగ్‌ రోల్స్‌ అంటే చాలు అందరికీ గుర్తొచ్చే నటుడు ఆది పినిశెట్టి. హీరోగా సినిమాలు చేస్తూనే, విలక్షణ పాత్రలకూ సై అంటుంటాడు ఈ యంగ్‌ హీరో. అందుకే హీరోలందు ఆదిపినిశెట్టి వేరయా అనాలేమో. తాజాగా మన హీరోగారు ఓ కొత్త సినిమా షురూ చేశారు. ఆ సినిమా పేరు 'క్లాప్‌'. క్లాప్‌ అంటే చాలా అర్ధాలుంటాయి. ఇక్కడ క్లాప్‌ అంటే చప్పట్లేనేమో. ఎందుకంటే మనోడు ఈ సినిమాలో అధ్లెట్‌గా కనిపించబోతున్నాడు. 400 మీటర్ల రన్నింగ్‌ రేస్‌ ఛాంపియన్‌గా ఆది నటిస్తున్నాడు. పృధ్వి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

ఇంతవరకూ స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ని టచ్‌ చేయని ఆది ఈ సినిమాతో ఆ ముచ్చటా తీర్చేసుకోనున్నాడు. సినిమా సినిమాకీ తనని తాను డిఫరెంట్‌గా మార్చేసుకునే ఆది ఈ సినిమా కోసం ఏం చేశాడయ్యా అంటే, ఏకంగా 10 కిలోల బరువు తగ్గాడు. అథ్లెట్‌ అంటే తెలుసు కదా.. తక్కువ దూరాల్ని అతి వేగంగా ఛేదించే ఫాస్ట్‌ రన్నర్‌ అన్న మాట. ఆ క్యారెక్టర్‌ కోసం తన శరీరాన్ని పక్షిలా లైట్‌ వెయిట్‌ చేసేసుకున్నాడన్నమాట. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా 'మళ్లీ రావా' ఫేం ఆకాంక్షసింగ్‌ నటిస్తోంది. ఈ బ్యూటీ కూడా ఈ సినిమాలో క్రీడాకారిణిగానే కనిపించబోతోంది. హీరో లైఫ్‌లో వెరీ వెరీ ఇంపార్టెంట్‌ రోల్‌ పోషించనుందట హీరోయిన్‌గా ఈ పాత్ర. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. 'రంగస్థలం' సినిమాతో చిట్టిబాబుకి అన్నయ్య కుమార్‌బాబు పాత్రకి ప్రాణం పెట్టేసిన ఆది పినిశెట్టి ఈ సారి అథ్లెట్‌గా ఎలాంటి మ్యాజిక్‌ చేయబోతున్నాడో చూడాలిక. 

మరిన్ని సినిమా కబుర్లు
churaka