Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

హనీ' అందరికీ 'బెస్ట్‌' అయిపోతోందే.!

honey  is the best

'మహాలక్ష్మి'గా 'కృష్ణగాడి వీరప్రేమగాధ' సినిమాతో క్యూట్‌గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ మెహ్రీన్‌. ఈ సినిమాతో సూపర్‌ హిట్టు కొట్టింది కానీ, ఏడాది పాటు గ్యాప్‌ తీసుకుంది. ఈ ఏడాదిలో వరుస పెట్టి సినిమాలతో దండయాత్ర చేసింది. ఎక్కడ చూసినా మెహ్రీనే అన్నట్లుగా వరుస సినిమాలతో ఆకట్టుకుంది. అయితే, అందులో ఒకటీ, అరా తప్ప పెద్దగా సక్సెస్‌ అయిన సినిమాలేం లేవు. కానీ, ఈ ఏడాది వచ్చిన 'ఎఫ్‌ 2' మెహ్రీన్‌ దశ మార్చేసింది. 'హనీ ఈజ్‌ ద బెస్ట్‌' అంటూ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ఇచ్చి, మెహ్రీన్‌ రేంజ్‌ ఎక్కడికో తీసుకెళ్లిపోయింది 'ఎఫ్‌ 2'. ఈ సినిమా హిట్‌తో మెహ్రీన్‌కి అవకాశాలు కూడా పోటెత్తుతున్నాయి.

అంతేకాదండోయ్‌ క్యూట్‌గా కనిపించే మెహ్రీన్‌లో మెచ్యూరిటీ లెవల్స్‌ కూడా బాగా పెరిగేశాయనీ ఆ నోటా ఈ నోటా వినబడుతున్న మాట. ఎందుకంటే, ఆమె ఎంచుకుంటున్న పాత్రలు అలాంటివి మరి. తాజాగా ఆమె చేతిలో మూడు నాలుగు సినిమాల వరకూ ఉన్నాయి తెలుగులో. తమిళంలో ఓ సినిమాలో నటిస్తోంది. ఇక హిందీ 'ఎఫ్‌ 2'లో కూడా మెహ్రీన్‌ పాత్ర కోసం ఆమెనే ఎంచుకోవాలనే ఆలోచనలు జరుగుతున్నాయట. ఇలా మెహ్రీన్‌ ప్రస్తుతం ఇటు తెలుగులోనూ, అటు తమిళ, హిందీ భాషల్లో కూడా బెస్ట్‌ ఆప్షన్‌గా మారింది. తెలుగులో యంగ్‌ హీరో నాగశౌర్యతో ఓ సినిమా ఆల్రెడీ స్టార్ట్‌ అయ్యింది. ఆరడుగుల ఆజానుబాహుడు గోపీచంద్‌తో 'పంతం' సినిమా తర్వాత మరోసారి జోడీ కడుతోంది. అదే 'చాణక్య'. తిరు ఈ సినిమాకి దర్శకుడు. అలాగే నందమూరి హీరోతో తొలిసారి జత కడుతోంది. నందమూరి కళ్యాణ్‌రామ్‌ సరసన మెహ్రీన్‌ హీరోయిన్‌గా ఓ సినిమా ఓకే అయ్యింది. 'శతమానం భవతి' డైరెక్టర్‌ సతీష్‌ వేగేశ్న ఈ సినిమాకి దర్శకుడు. 

మరిన్ని సినిమా కబుర్లు
canneda beauty