Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
hyumarasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

ప్రతాపభావాలు - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

pratapabhavalu

సాటి మనిషిని..
మిట్ట మధ్యాహ్నం!

ఒక మనిషి సేల్స్ కోసమో, సర్వీసు కోసమో మనింటికొస్తాడు.

“నువ్వెప్పుడు రావాలి?ఎప్పుడొచ్చావు? డిసిప్లీన్ లేని నువ్వేం పైకొస్తావ్”అని విసుక్కుంటాం, కసురుతాం.

ఇలాంటి అనుభవాలతో దెబ్బతిన్న అతను మారడు సరిగదా, మరింత మొండిగా తయారవుతాడు.

ఆటోవాళ్ళతో, కూరగాయలు అమ్మేవాళ్ళతో, పోస్ట్ మ్యాన్ తో, పేపర్ వేసేవాళ్ళతో నిత్యం అవసరం పడుతుంది.వాళ్ళలోని సేవాభావాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిది.

అతను మనింటికి రాగానే తాగడానికి కాసిన్ని మంచి నీళ్ళిచ్చి (వీలుంటే కప్పుడు గరం చాయ్) ఇస్తే అతనిలోని మానవత్వాన్ని కాపాడుకున్నవాళ్ళమవుతాం. అతని బాధ్యత అయిన సర్వీస్, నిజమైన సర్వీస్ (సేవగా ) మారుతుంది.

అసలు మనిషి నెగటీవ్ గా మారడానికి మరో మనిషే కారణం.

ఎవరూ ‘నేను రాక్షసుడిగా ఉండాలి. తెల్లారి లేచింది మొదలు నన్నందరూ తిట్టుకోవాలి’ అనుకోరు. మనం అలా తయారు చేస్తాం. ఎక్కడో ఒకళ్ళిద్దరు స్వతహాగా వికృత మనస్తత్వంతో ఉండవచ్చు. అది సృష్టి లోపం. చాలావరకు మంచివాళ్ళే ఉంటారు. పిల్లలు చక్కగా చదువుకోడానికి, చదవకపోడానికి టీచర్లే కారణం. పాలన చక్కగా ఉండడానికి నాయకులే కారణం.

మనుషులు చక్కగా ఉండడానికి సంఘమే కారణం. బయట విశృంఖలంగా ప్రవర్తించేవాళ్ళు. మిలట్రీలో, ఆశ్రమాల్లో ఎంత బుద్ధిగా సేవాభావంతో ఉంటారు. ప్రతి మనిషికి సమాజం నుంచి గౌరవ మర్యాదలు పొందాలనుంటుంది. కాని కొన్ని వృత్తుల రిత్యా వాళ్ళది తక్కువ స్థాయేమో అన్నభావన సరికాదు. పని మీద ప్రపంచం  నడుస్తుంది.ఏ పనైనా గౌరవనీయమే! నీచ భావంతో చూసేవారి మనస్తత్వమే అధమం.

మనిషిని మనిషి గౌరవించాలి. అది చేసే వృత్తిని బట్టి కాకూడదు.

***

మరిన్ని శీర్షికలు
kerala viharayatralu