Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Bendakaya Pulusu - Easy Method

ఈ సంచికలో >> శీర్షికలు >>

21-06-2019 నుండి 27-06-2019 వరకు వారఫలాలు - డా. టి. శ్రీకాంత్

మేష రాశి :   (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )

 ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ఆర్థికపరమైన విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. సోదరులతో కాస్త సర్దుకుపోవడం వలన మేలుజరుగుతుంది. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. కుటుంబపరమైన విషయాల్లో కాస్త నిదానంగా వ్యవహరించుట సూచన. స్వల్పదూరప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. బంధువులను కలుస్తారు, వారితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది.

 

 


 వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)

 ఈవారం మొత్తం మీద ముఖ్యమైన విషయాలపై ద్రుష్టి పెట్టుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. వ్యాపారపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. ఉద్యోగంలో బాగానే ఉంటుంది, నూతన అవకాశాల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. విదేశీప్రయాణప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది. విలువైన వస్తువులను బహుమతిగా పొందుటకు ఆస్కారం ఉంది. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. బంధువుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి.

 

 

 

మిథున రాశి :  (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)

ఈవారం మొత్తం మీద ముఖ్యమైన విషయాలలో నిర్ణయాలు తీసుకొనే ముందు అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ఆర్థికపరమైన విషయాల్లో ఒకింత ఇబ్బంది తప్పక పోవచ్చును వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. దైవపరమైన విషయాల్లో సమయం గడుపుట మంచిది. చిన్న చిన్న విషయాలను సైతం అశ్రద్ధ చేయకండి. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయకండి, తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. మిత్రులను కలుసుకొనే అవకాశం ఉంది.

 

కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)

ఈవారం మొత్తం మీద పెద్దలను కలుస్తారు, వారినుండి ఆశించిన మేర సహకారం కాస్త నిదానంగా వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో సమస్యలు వచ్చే ఆస్కారం ఉంది. ముందుగా గతంలో చేపట్టిన పనులను పూర్తిచేయుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. సాధ్యమైనంత మేర అనవసరమైన విషయాలకు అలాగే చర్చలకు దూరంగా ఉండుట సూచన. వాహనాల వలన ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది, కాస్త జాగ్రత్త అవసరం.

 

 

సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )

ఈవారం మొత్తం మీద కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. వ్యాపారపరమైన విషయంలో మిశ్రమ ఫలితాలు సూచితం , పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. విదేశీప్రయాణప్రయత్నాలు కలిసి వస్తాయి. చిన్న చిన్న విషయాలకు సైతం ప్రాధాన్యం ఇవ్వడం వలన మేలుజరుగుతుందో. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. మిత్రులను కలుస్తారు , వారితో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం కలదు.

 

కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )

ఈవారం మొత్తం మీద సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు, వేచిచూసే ధోరణి మంచిది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో బాగానే ఉన్న ఎదో తెలియని అసంతృప్తి ఇబ్బంది పెట్టె అవకాశం కలదు. ఉద్యోగంలో నూతన అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు బాగానే ఉంటాయి, కాస్త శ్రమించుట ద్వారా మేలుజరుగుతుంది. సోదరులతో మాటపట్టింపులకు వెళ్ళకండి. కుటుంబపరమైన విషయాల్లో బంధువుల సూచనలను కాస్త పరిగణలోకి తీసుకోవడం మంచిది.

 

 

తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )

 ఈవారం మొత్తం మీద ఆర్థికపరమైన విషయాలకు ప్రాధాన్యం ఇస్తారు. చేపట్టిన పనులను వేగంగా పూర్తిచేసే అవకాశం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. గతంలో మీకున్న పరిచయాలను ఉపయోగించుకొనే ప్రయత్నం చేస్తారు. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. రుణపరమైన విషయాల్లో ఎవరికీ మాటఇవ్వకపోవడం సూచన. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు.

 

.

 

 
వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )

 ఈవారం మొత్తం మీద పెద్దలను కలుస్తారు, వారినుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. చిన్న చిన్న విషయాలకు సైతం ప్రాధాన్యం ఇవ్వడం సూచన. పెద్దలతో మాటపట్టింపులకు వెళ్ళకండి. మీ మాటతీరు కొంతమందికి నచ్చకపోవచ్చును. వివాదస్పదమైన వ్యాఖ్యలు చేయకపోవడం సూచన. విలువైన వస్తువుల విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. స్వల్పదూరప్రయాణాలు చేయుటకుఆస్కారం ఉంది. ఆరోగ్యం విషయంలో కొంత ఉపశమనం ఉంటుంది.


ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )

ఈవారం మొత్తం మీద అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ఉద్యోగంలో నూతన అవకాశాలు పొందుతారు. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడుతుంది. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉండే అవకాశం ఉంది. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది. మిత్రులను కలుస్తారు.
 

మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )

ఈవారం నూతన పరిచయాలకు అవకాశం ఉంది. మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుతారు. విలువైన వస్తువులను కొనుగులు చేయుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. గతంలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండుట సూచన. కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఆత్మీయులతో మనస్పర్థలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. చర్చలకు దూరంగా ఉండుట సూచన.

 

కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )

ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో అధికారులతో కలిసి నూతన ప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో అవకాశాల కోసం చేసిన పనులు ముందుకు సాగుతాయి. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి రావడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువులను కలుస్తారు వారినుండి వచ్చే సహకారం లభిస్తుంది. మిత్రులతో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. సంతానంతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది.

 

మీన రాశి :  (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )

ఈవారం మొత్తం మీద దైవపరమైన విషయాలకు సమయం ఇస్తారు. గతంలో చేపట్టిన పనుల వలన నలుగురిలో మంచి గుర్తింపు లభిస్తుంది. వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. సంతానంతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. సోదరులతో కాస్త సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన. బంధువుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. 

 

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం

మరిన్ని శీర్షికలు
kashi cartoons