Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chamatkaaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

పంచరత్నాలు - ..

 

సుబ్బారావు  యోగా స్కూలుకి వచ్చి అక్కడి గురువు గారిని కలిశాడు.
"గురువుగారు , నేను ఆల్కాహాలిక్ ని. యోగా నేర్చుకుంటే మార్పు వస్తుందని పేపర్ల  లో చదివాను". అందుకే మీ స్కూల్ లో జాయిన్ చేసుకోండి సార్.
ఆనందించాడు గురువుగారు.
తప్పకుండా చేర్చుకుంటాను. రేపటి నుంచే మీరు జాయిన్ అవ్వండి అన్నాడు.
జాయినయ్యాడు సుబ్బారావు ఆరు నెలలు గడిచాయి. ఒక రోజు సుబ్బారావుని పిలిచి అడిగారు గురువుగారు.
మీ డ్రింకింగ్ హాబిట్స్ లో ఏమైనా మార్పు వచ్చిందా?
వచింది సార్! ఇప్పుడు శీర్షాసనం వేసి మరీ తాగుతున్నాను అన్నాడు సుబ్బారావు.


****

అప్పట్లో బాగా కాపీలు కొట్టేవాడివీ ఇప్పుడేం చేస్తున్నావురా" అడిగాడు టీచర్ తన ఓల్డ్ స్టూడెంట్ ని.
"డబ్బింగ్ సినిమాలకు డైలాగ్ లు రాస్తున్నా సార్"


****



ఎలా దొరికిపోయావు తోటి ఖైదీ అడిగాడు.
"బ్యాంకు దోపిడీకి పిస్టల్ తీసుకుని వెళ్ళా, బ్యాంకు వాళ్ళంతా వాళ్ళ డబ్బుని నా బ్యాగ్ లో వేశారు. పని  అయిపోయింది కదా అని నా పిస్టల్ ని కీడా బ్యాగ్ లో వేసి మూట కట్టా"


****



 

మీ ఆవిడ వారం లో రెండు రోజులు ఉపవాసం వుంటుందట కదా! ఎలా వుండగలుగుతుందో అడిగాడు కొలీగ్.
"ఉపవాసమా! పాడా! ఆ రెండు రోజులు నన్ను వేపుకుతింటుంది.


****


 

 

కేసు రికార్డుల్లో పదేళ్ళ పిల్ల అని వుంది. సాక్షిగా 30 ఏళ్ళ ఆమెను తెచ్చి పెట్టారు కోప్పడ్డాడు జడ్జి.
నిజమేనండీ కేసు మొదలైనప్పుడు ఆమెకు పదేళ్ళేనండీ..చెప్పాడు

మరిన్ని శీర్షికలు
kerala viharayatralu