యంగ్ హీరో సందీప్ కిషన్‌లో ఉండాల్సిన టాలెంట్ అంతా ఉన్నప్పటికీ, అసలుండాల్సిన 'లక్' మాత్రం లేదు. లక్కు ఉంటేనే కదా.. అసలు సిసలు లెక్క తేలేది. సందీప్ కిషన్ కెరీర్‌లో 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత ఆ స్థాయి హిట్‌ని మరే సినిమా అందించలేదు సందీప్‌కిషన్‌కి. అయితే, ఇప్పుడు రాబోతున్న సినిమాతో మంచి కసి మీదున్నాడు మనోడు. ఇటీవల ఓ నిర్మాత ఆయన్ని అవమానించేలా మాట్లాడారట. దాంతో మనోడు వారూ వీరూ కాదు.. సొంత నిర్మాణంలోనే సినిమా ప్లాన్ చేసేశాడు. అదే 'నిను వీడని నీడను నేనే'. టైటిల్ బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి నుండీ బాగా అలవాటైందే. అయితే, కథ మాత్రం చాలా కొత్తగా ఉండబోతోంది. టైటిల్‌ని బట్టి ఇదేదో హారర్ మూవీ అని మీరు ఎలాగూ గెస్ చేసేసి ఉంటారు.
మీరు టూ స్మార్ట్.. అవును ఇది హారర్ కథాంశమే. అయితే, ఇంతవరకూ వచ్చిన హారర్ సినిమాల దారి వేరు. 'నిను వీడని నీడను నేనే' సినిమా దారి పూర్తిగా వేరు. ఈ సినిమాలో హీరో సందీప్‌కిషనే. కానీ, ఆయన అద్దంలో చూసుకుంటే కనిపించే ప్రతిబింబం మాత్రం వెన్నెల కిషోర్‌ది. అదే ఈ సినిమాలోని ట్విస్ట్. అద్దంలో వేరే వాళ్ల ప్రతిబింబం ఎందుకు కనిపించడమేంటండీ.? మరీ విడ్డూరం కాకపోతేనూ.. అనకండి. అందులోంచి పుట్టిందే ఈ సినిమా కథ. ఫుల్ ఫన్‌తో ఇంట్రెస్టింగ్ కథాంశంతో రూపొందింది. హారర్ కామెడీ చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో అన్యా సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ముందే చెప్పుకున్నాం కదా.. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు మనోడు. కొట్టాలి ఏంటీ.. కొట్టేస్తాడేమో కూడా. జూలై 12న ఈ 'వీడని నీడ' కథేంటో తేలిపోనుంది.
|