రామ్ పోతినేని ఏంటండీ బాబూ అలా మారిపోయాడు. మరీ అంత మాస్‌నా.? అబ్బో ఊరమాస్‌లెండి. పక్కా హైద్రాబాదీ పోరగాడు. హైద్రాబాదీ పాత బస్తీ పోరగాడంటే ఇంత ఊరమాస్‌గా ఉంటాడా.? ఉన్నాడు కదండీ మన శంకర్. అదే 'ఇస్మార్ట్ శంకర్'. పూరీ హీరోలు ఎలా ఉంటారో ఓ ఐడియా ఉండనే ఉంది. కానీ, మరీ ఇంత మాస్ హీరోని మాత్రం ఇదే తొలిసారేమో చూడడం. ఇస్మార్ట్ శంకర్ కోసం రామ్ అలా మారిపోయాడు మరి. తన హీరోని మాస్ యాంగిల్‌లో గత చిత్రాలతో పోల్చితే పదింతలు ఎక్కువ చేసి చూపించాడు పూరీ జగన్నాధ్. అన్నీ ఎక్కువే ఈ హీరోకి. బోల్డ్ డైలాగులు, వైల్డ్ రొమాన్స్, కిర్రాక్ యాక్షన్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే, ఇస్మార్ట్ శంకర్ ఊరమాస్‌కా బాప్ అంతే. ఇక హీరోయిన్స్‌ని పటాయించడంలో మన శంకర్ రూటే సెపరేటు. అలా ఇలా కాదు, ఏకంగా ఎత్తి కుదేస్తాడంతే హీరోయిన్స్‌ని. ఆ సిక్స్ ప్యాక్ బాడీ వేసుకుని, ఊరమాస్ బాడీ లాంగ్వేజ్‌తో అంత చేస్తే, ముద్దుగుమ్మలు పడకుండా ఉంటారా.? సమస్యే లేదు పడి తీరాల్సిందే.
అందుకే ఇద్దరు భామలు మన శంకర్‌కి పడిపోయారు. వారే నభా నటేష్, నిధి అగర్వాల్. ఇద్దరూ ఇద్దరే గ్లామర్ ఇరగదీసేశారు. సహజంగా పూరీ సినిమాల్లో ఉండే గ్లామర్ డోస్ ఈ సినిమాలో వెయ్యి రెట్లు ఎక్కువయ్యిందనే చెప్పాలి. హీరోయిన్స్ చేత కూడా బోల్డ్ డైలాగులు చెప్పించేశాడు పూరీ. ఇక రొమాన్స్ అంటారా.? వైల్డ్ మీనింగ్ ఇవ్వాల్సిందే దానికి. డైలాగ్స్ ఘాటెక్కించేస్తున్నాయి. అబ్బే ఇదంగా ఇంకా 'ఇస్మార్ శంకర్' ట్రైలర్ కథేనండీ బాబూ. ఇంకా సినిమా విడుదల కానేలేదు. జూలై 18న విడుదలవుతుంది. ఇక విడుదలైతే ఇంకెంత లొల్లి చేయాలో ఈ సినిమా గురించి.. ఇప్పుడప్పుడే చెప్పలేం.. ఇప్పటికింతే దేత్తడీ పోచమ్మ గుడీ.!
|