అదో పల్లెటూరు. ఈ కాలంలో పల్లెటూరు కాదులెండి. 80ల కాలం నాటి పల్లెటూరు. అప్పటి పల్లెటూళ్లంటే, రాజు, పేద బేధాలు.. కుల కట్టుబాట్లు ఇలా చాలానే ఉండేవి. ఊరి పెద్ద కూతుళ్లంటే దొరసానులే. కూలీ పని వాళ్లంటే పేదోళ్లు, తక్కువ కులానికి చెందిన వాళ్లే ఉండేవారు. అలా రాజు కూతురు దొరసానిని ప్రేమించిన ఓ కూలీ కొడుకు కథే ఈ 'దొరసాని'. కథలో కొత్తదనమేమీ లేదు కానీ, కథనం కొత్తగా నడిపించాడు డైరెక్టర్. కొత్త నటీనటులు ఆనంద్ దేవరకొండ, శివాత్మికలు తమ పాత్రలకు న్యాయం చేసినట్లే కనిపిస్తున్నారు ప్రచార చిత్రాల ద్వారా తెలిసిన సమాచారమ్ ప్రకారం. కొత్త నటీనటులు కావడంతో, కథలో ఫ్రెష్‌నెస్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
లేటెస్ట్‌గా విడుదలైన ట్రైలర్ ద్వారా కథను చూచాయగా రివీల్ చేశారు. ఇక పూర్తి డీటెయిల్స్ కావాలంటే జూలై 12 వరకూ వేచి చూడాల్సిందే. ఆ రోజే 'దొరసాని' ధియేటర్స్‌లో సందడి చేయనుంది. పీరియాడిక్ స్టోరీ అయినా నేటి తరం యూత్‌కి కనెక్ట్ అయ్యేలానే కంటెంట్ కనిపిస్తోంది. ఆనంద్ దేవరకొండ యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్‌లో అన్న విజయ్ దేవరకొండను తలపిస్తున్నాడు. ఆనంద్ పాత్రకు విజయ్ డబ్బింగ్ చెప్పాడా.? అన్నట్లుగా ఉంది ఆయన వాయిస్. అయితే, పాత్ర పరంగా విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్ అంతగా రివీల్ కాలేదు. ఏమో సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి మరి. ఇకపోతే, రాజశేఖర్ - జీవితా దంపతుల చిన్న కుమార్తై అయిన శివాత్మిక దొరసానిగా నేచురల్ లుక్‌తో ఆకట్టుకుంటోంది. అన్నట్లు నేటి యూత్‌కి కనెక్ట్ అయ్యే కంటెంట్ అన్నాం కదా.. ఏంటనుకునేరు.. ఇంకేముంటుందండీ.. అదే హా.. లిప్‌లాక్ సీన్సే. అవి కూడా ఉన్నాయంటూ ట్రైలర్‌లో చిన్న హింట్ ఇచ్చారండోయ్. అది లేకుండా యూత్‌ని ధియేటర్స్‌కి రప్పించలేకపోతున్న మాయదారి రోజులైపోయాయో. ఇంతకీ ఈ సినిమాకి కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఎవరో చెప్పలేదు కదా.. ఆయనా కొత్తాయనే. పేరు కె.వి.ఆర్ మహేంద్రా. అదీ మన 'దొరసాని' ముచ్చట.
|