Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

రణరంగం చిత్రసమీక్ష

ranarangam movie review

చిత్రం: రణరంగం 
నటీనటులు: శర్వానంద్‌, కళ్యాణి ప్రియదర్శన్‌, కాజల్‌, మురళీ శర్మ, బ్రహ్మాజీ, సుబ్బరాజు తదితరులు 
సినిమాటోగ్రఫీ: దివాకర్‌ మణి 
సంగీతం: ప్రశాంతి పిళ్ళై 
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ 
నిర్మాణం: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 
దర్శకత్వం: సుధీర్‌ వర్మ 
విడుదల తేదీ: 15 ఆగస్ట్‌ 2019

క్లుప్తంగా చెప్పాలంటే

స్వర్గీయ ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా అమలు చేసిన మద్య నిషేధం వ్యవహారాన్ని ఓ యువకుడు ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంటాడు. బ్లాక్‌లో మద్యం అమ్మి, సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో ఆదాయం పెరగడం మాత్రమే కాదు, శతృవులూ పెరుగుతారు. ఆ యువకుడే దేవ. దేవ ఎదురుగుతోంటే, ఆ ఎదుగుదలతోపాటే ప్రమాదాలూ పెరుగుతాయి. ఈ క్రమంలో తనవారిని కాపాడుకునేందుకు మరింత బలవంతుడిగా, శక్తివంతుడిగా మారాలనుకుంటాడు. ఈ ప్రయాణంలో దేవ జీవితం కొత్త కొత్త మలుపులు తిరుగుతుంటుంది. ఇంతకీ, ఈ ప్రయాణంలో దేవ ఎదుర్కొన్న సమస్యలేంటి.? దేవ దక్కించుకున్నదేంటి.? పోగొట్టుకున్నదేంటి.? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

మొత్తంగా చెప్పాలంటే

శర్వానంద్‌ చాలా మంచి నటుడు. ఈ విషయం ఇప్పటికే చాలా సినిమాల విషయంలో చెప్పుకున్నాం. ఏ సినిమా చేసినా, నటుడిగా శర్వానంద్‌ ఎప్పుడూ నిరాశపర్చలేదు. ఈ సినిమా విషయంలోనూ అంతే. తెరపై శర్వానంద్‌ని చూస్తున్నంతసేపూ, 'దేవ' పాత్ర మాత్రమే కనిపిస్తుంది. అంతలా ఆ పాత్రలో లీనమైపోయాడు శర్వానంద్‌. సినిమా మొత్తాన్నీ తన భుజాల మీద మోసేశాడు. చాలా సన్నివేశాల్లో తన నటనతో సినిమాని ఇంకో లెవల్‌కి తీసుకెళ్ళే ప్రయత్నం చేశాడు. పాతికేళ్ళ కుర్రాడిలా, నలభయ్యేళ్ళ వ్యక్తిగా.. శర్వానంద్‌ ప్రదర్శించిన నటన అద్భుతం అంతే.

కళ్యాణి ప్రియదర్శన్‌ చాలా బాగా చేసింది. కాజల్‌ పాత్ర సరిగ్గా ఉపయోగపడలేదు. మురళీ శర్మ కొత్తదనంతో కూడిన పాత్రలో కనిపించి మెప్పించాడు. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగానే చేశారు.

కథ గతంలో చాలా సినిమాల్లో చూసిందే. కథనం విషయంలో కొంచెం తడబడినట్లు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాలోని పేలవమైన సన్నివేశాల్నీ బాగా ఎలివేట్‌ చేసింది. ఎడిటింగ్‌ ఇంకాస్త అవసరం అనిపిస్తుంటుంది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఓకే. ప్రొడక్షన్‌ వాల్యూస్‌ సూపర్బ్‌.

సాంకేతిక విభాగాల్ని అత్యద్భుతంగా డీల్‌ చేసిన దర్శకుడు కథనం విషయంలో కొంత తడబడ్డాడు. సినిమాని వేగంగా నడిపించడంలో ఫెయిలయ్యాడు. శర్వానంద్‌ చాలా సన్నివేశాల్ని ఇంకో లెవల్‌కి తీసుకెళ్ళే ప్రయత్నం చేసినా, హీరో పాత్రని దర్శకుడు డిజైన్‌ చేసిన తీరులోనే లోపాలు కన్పిస్తాయి. ఎలివేషన్‌ అప్‌ టు ది మార్క్‌ లేకపోవడం పెద్ద మైనస్‌. కాన్‌ఫ్లిక్ట్‌ విషయంలోనూ దర్శకుడు పూర్తిస్థాయిలో శ్రద్ధ పెట్టలేదేమో అన్పిస్తుంది. మాటలు మాత్రం బావున్నాయి. చాలా సంభాషణలు థియేటర్‌ నుంచి బయటకు వచ్చాక కూడా వెంటాడతాయి. బహుశా ఆ మాటలు శర్వానంద్‌ నుంచి రావడంతో వాటికి వెయిటేజీ ఇంకా పెరిగిందనుకోవాలేమో. ఓవరాల్‌గా టెక్నికల్‌ అంశాలు, హీరో శర్వానంద్‌ పెర్ఫామెన్స్‌ వారెవ్వా అనిపిస్తాయి. మిగతా విషయాల్లో మాత్రం థంబ్స్‌ డౌన్‌.

అంకెల్లో చెప్పాలంటే..

2.75/5

ఒక్క మాటలో చెప్పాలంటే..

రణరంగం.. సాంకేతికంగా అద్భుతం, కథనం గందరగోళం  

మరిన్ని సినిమా కబుర్లు
rakshasudu churaka