Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
ismart directer

ఈ సంచికలో >> సినిమా >>

బాహుబలి'తో 'సాహో'ని పోల్చడం భావ్యమా.?

bahubali

తెలుగు సినిమా ఖ్యాతిని దేశ దేశాల చాటి చెప్పిన సినిమా 'బాహుబలి'. ఆ స్థాయిలో మరిన్ని సినిమాలు రావాలని ఆశించడం తప్పు లేదు. కానీ, ఆ సినిమాతో 'సాహో'ని పోల్చడం భావ్యం కాదు. యాక్షన్‌ ప్యాక్‌డ్‌ భారీ బడ్జెట్‌ చిత్రంగా తెరకెక్కుతోన్న 'సాహో'ని 'బాహుబలి' చిత్రంతో పోల్చి చూస్తున్నారు ఈ మధ్య చాలా మంది. కానీ, 'బాహుబలి' స్థాయి వేరు. 'సాహో' స్థాయి వేరు. ఆ సినిమా మార్కెటింగ్‌ వేరు. బడ్జెట్‌ వేరు. పరిమితుల స్థాయి వేరు. ఆ సినిమాతో 'సాహో'కి పోలిక ఇంచెత్తైనా ఉండదు. హాలీవుడ్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్లు, భారీ యాక్షన్‌ సీక్వెన్సెస్‌, కళ్లు చెదిరే సెట్టింగ్స్‌ ఉండొచ్చుగాక. కానీ, 'బాహుబలి'తో పోల్చదగ్గ సినిమా 'సాహో' కాదనీ కొందరు అభిప్రాయ పడుతున్నారు. 'బాహుబలి'తోనే ప్రబాస్‌కి యూనివర్సల్‌ గుర్తింపు దక్కింది. అది అక్షరాలా సత్యం.

పది హిట్‌ సినిమాల్లో నటించినా రాని పాపులారిటీ 'బాహుబలి' సినిమాతో దక్కించుకున్నాడు ప్రబాస్‌. ఆ సినిమా తర్వాత ప్రబాస్‌ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటేస్తున్నాయి. ఇదిలా ఉంటే, 'బాహుబలి' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ని హైద్రాబాద్‌లో ని రామోజీ ఫిల్మ్‌ సిటీలో గ్రాండ్‌గా నిర్వహించిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు 'సాహో' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కూడా అక్కడే నిర్వహించాలని 'సాహో' టీమ్‌ భావించింది. ఈ నెల 18న ఈ ఈవెంట్‌కి భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో రూపొందుతోన్న 'సాహో' ఆగస్ట్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా కబుర్లు
Valmiki' starring Varun