Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Poojahegde to pair with Akhil

ఈ సంచికలో >> సినిమా >>

వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' నేనే అంటోన్న రౌడీ స్టార్‌

world famous lover

అభిమానులచే 'రౌడీస్టార్‌' అని ముద్దుగా పిలిపించుకునే విజయ్‌ దేవరకొండ త్వరలో 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌'గా రాబోతున్నాడు. క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రానికి ఈ టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. ఈ టైటిల్‌ వింటుంటే గతంలో ఇంకేదో గుర్తుకొస్తోంది కదా.. గెస్‌ చేయండి.. ఒకవేళ మీరు గెస్‌ చేస్తే అది మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ సినిమా అయితే, ఓకే. రామ్‌ చరణ్‌ నటించిన 'ఆరెంజ్‌' సినిమాలో పదే పదే వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ని అంటూ చెబుతూ ఉంటాడు. ఆయనకి 10 లవ్‌ స్టోరీలు కూడా ఉంటాయ్‌. ఇప్పుడే అదే మన రౌడీస్టార్‌ తన సినిమా టైటిల్‌గా పెట్టుకుని ఇంప్రెస్‌ చేయడానికి వచ్చేస్తున్నాడు. అయితే మనోడికి పది లవ్‌ స్టోరీల్లేవ్‌లెండి. నాలుగు మాత్రమే ఉన్నాయి. అందుకోసం నలుగురు ముద్దుగుమ్మలు కూడా రెడీగా ఉన్నారు.

వాళ్లే రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్‌, కేథరీన్‌, ఇసా బెల్లె. 'గీత గోవిందం'లో మనోడు ఒక్క హీరోయిన్‌తో వేగడానికే చాలా కష్టపడిపోయాడు పాపం. ఇప్పుడు నలుగురు ముద్దుగుమ్మలతో.. అందులోనూ వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ అంటున్నాడు. ఏం చేస్తాడో, ఎలా చేస్తాడో చూడాలి మరి. క్రాంతిమాధవ్‌ టేకింగ్‌లో 'మళ్లీ మళ్లీ రాని రోజు' సినిమా చూశాం. అందులో శర్వానంద్‌, నిత్యామీనన్‌ మధ్య లవ్‌ ట్రాక్‌ నడిపించిన విధానం, ఆ ట్రాక్‌ని ఆడియన్స్‌కి కనెక్ట్‌ చేసిన వైనం అబ్బురపరుస్తాయి. మరి ఇప్పుడు నలుగురు భామలతో మన రౌడీ స్టార్‌ని వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌గా ఎలా చూపిస్తాడో చూడాలిక.

మరిన్ని సినిమా కబుర్లు
Another horror on Keira's account!