Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
world famous lover

ఈ సంచికలో >> సినిమా >>

కైరా ఖాతాలో మరో హారర్‌.!

Another horror on Keira's account!

కమర్షియల్‌ హీరోయిన్‌గా రాకెట్‌ స్పీడుతో దూసుకెళ్లిపోతున్న ముద్దుగుమ్మ కైరా అద్వానీకి లారెన్స్‌ పుణ్యమా అని ఓ ఛాలెంజింగ్‌ రోల్‌ దొరికింది 'కాంచన' రీమేక్‌తో. తమిళ, తెలుగు భాషల్లో మంచి విజయం అందుకున్న లారెన్స్‌ మార్క్‌ హారర్‌ కామెడీ మూవీ 'కాంచన'ను హిందీలో రీమేక్‌ చేస్తున్నాడు. ఈ రీమేక్‌లో హీరో అక్షయ్‌ కుమార్‌ హీరోగా కాగా, హీరోయిన్‌గా కైరా అద్వానీని ఎంచుకున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా మరో హారర్‌ కామెడీ చిత్రం కైరా ఖాతాలో పడింది. గతంలో అక్షయ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కి సంచలన విజయం అందుకున్న 'భూల్‌ బులయ్యా' సినిమాకి ఇప్పుడు సీక్వెల్‌ రూపొందిస్తున్నారు. ఈ సీక్వెల్‌లో అక్షయ్‌ నటించడం లేదు. కానీ, యంగ్‌ హీరో కార్తీక్‌ ఆర్య నటిస్తున్నాడు. కార్తీక్‌ ఆర్యకు జంటగా కైరా అద్వానీని ఎంచుకున్నారు.

ఇది ఛాలెంజ్‌తో కూడుకున్న రోల్‌ కావడంతో, కైరా కొంచెం తటపటాయించిందట. అయితే, ఇలాంటి పాత్రలతోనే తనలోని నటి బయటికి వస్తుందని భావించిన కైరా అద్వానీ ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకుందట. ఎప్పుడో కానీ ఇలాంటి అవకాశాలు రావు. వచ్చినప్పుడు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. అదే చేస్తోంది కైరా అద్వానీ. నిజానికి కైరా ప్రస్తుతం బాలీవుడ్‌లో చాలా బిజీగా గడుపుతోంది. అరడజనుకు పైగానే సినిమాలు కైరా చేతిలో ఉన్నాయి. ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ ఇంకా క్రేజీయెస్ట్‌ ప్రాజెక్టులు కైరా ముందు క్యూ కడుతుండడం విశేషం. 'భూల్‌ బులయ్యా 2' చిత్రం ఖచ్చితంగా కైరాకి మంచి పేరు తీసుకొస్తుందనడంలో సందేహం లేదు. ఇంతకీ ఈ 'భూల్‌ బులయ్యా' మూల కథ ఏంటో తెలుసా.? తెలుగు, తమిళ భాషల్లో పాపులర్‌ మూవీ అయిన 'చంద్రముఖి'కి హిందీ రీమేక్‌.

మరిన్ని సినిమా కబుర్లు
sandeep nandi with goutam nandi