Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
kangana rumar

ఈ సంచికలో >> సినిమా >>

దీపావళికి 'సరిలేరు నీకెవ్వరూ..' స్పెషల్‌ ట్రీట్‌.!

special treat

ఫుల్‌ కాన్ఫిడెన్స్‌తో సంక్రాంతి రేస్‌లోకి దూకింది 'సరిలేరు నీకెవ్వరూ..'. ఒకే రోజు బన్నీ, మహేష్‌లు తమ తమ సినిమాలతో సంక్రాంతి కోడి పందానికి సిద్ధమయ్యారు. సంక్రాంతి రిలీజ్‌ కోసం ఇప్పటి నుండే ప్రమోషన్స్‌ కూడా షురూ చేసేశాయి ఈ రెండు సినిమాలు. అందులో భాగంగా, ఒకరికొకరు పోటీ పడుతూ, తమ తమ సినిమా అప్‌డేట్స్‌ని అందిస్తున్నారు. తాజాగా 'అల వైకుంఠపురములో..' నుండి సెకండ్‌ సాంగ్‌ టీజర్‌ వదిలారు. ఆల్రెడీ వచ్చిన 'సామజవరగమనా..' సాంగ్‌ యూ ట్యూబ్‌ సెన్సేషన్‌ అయ్యింది. 'రాములో రాములా..' అంటూ సాగే సాంగ్‌ని లేటెస్ట్‌గా వదిలారు. అయితే, చిన్న బిట్‌ మాత్రమే వదిలారు. దీపావళికి ఒక్క రోజు ముందు అంటే, ఈ నెల 26న ఫుల్‌ లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌ చేయనున్నారు. ఇదిలా ఉంటే, మహేష్‌ సినిమాకి సంబంధించి వదిలిన ఫస్ట్‌లుక్‌ టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

ఆర్మీ ఆఫీసర్‌ అజయ్‌ కృష్ణ అంటూ మహేష్‌ క్యారెక్టర్‌ పరిచయం జరిగింది. ఇక ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న లేడీ సూపర్‌ స్టార్‌ విజయశాంతి ఫస్ట్‌లుక్‌ని దీపావళికి రిలీజ్‌ చేయనున్నారట. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత విజయశాంతి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. కాలేజ్‌ లెక్చరర్‌ పాత్రలో విజయశాంతి నటించనుందని ఆల్రెడీ టాక్‌ బయటికి వచ్చింది. ఇక గెటప్‌ రివీల్‌ చేస్తే, ఫ్యాన్స్‌ ఓ క్లారిటీకి వస్తారు. అందుకు దీపావళి కన్నా మంచి సమయం ఇంకేవముంటుంది చెప్పండి. లెట్స్‌ వెయిట్‌ ఫర్‌ వాచింగ్‌ లేడీ సూపర్‌ స్టార్‌ గెటప్‌.!

మరిన్ని సినిమా కబుర్లు
rahul got finale ticket