Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
special treat

ఈ సంచికలో >> సినిమా >>

బిగ్‌బాస్‌: ఫినాలే టికెట్‌ దక్కించుకున్న రాహుల్‌.!

rahul got finale ticket

గత 90 రోజులుగా బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేస్తోన్న బిగ్‌బాస్‌ రియాల్టీ షో క్లైమాక్స్‌కి చేరుకుంది. ఇక రెండు వారాలు మాత్రమే మిగిలి ఉన్న బిగ్‌బాస్‌ షోలో ఆరుగురు కంటెస్టెంట్లు మాత్రమే మిగిలి ఉన్నారు. గత వారం వితిక అవుట్‌ అవ్వగా, ఈ వారం నామినేషన్‌ ప్రక్రియ కోసం భీకరమైన పోరు సాగింది హౌస్‌లో. ఇద్దరిద్దరు చొప్పున నడిచిన టాస్క్‌ల్లో రెండు టాస్క్‌లు గెలిచి రాహుల్‌ ఫినాలే టికెట్‌ని సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో ఫినాలే టికెట్‌ దక్కించుకున్న మొట్ట మొదటి కంటెస్టెంట్‌గా రాహుల్‌ రికార్డు సృష్టించాడు. తల్లి దీవెనతోనే తనకు ఆ టికెట్‌ దక్కిందని చాలా ఎగ్జయిట్‌ అయ్యాడు రాహుల్‌. ఇదే టికెట్‌ కోసం, బాబా భాస్కర్‌, అలీ రెజా ఫిజికల్‌గా చాలా ఎఫర్ట్‌ పెట్టి పోరాడారు. టాస్క్‌ల్లో అలీ రెజా పర్‌ఫామెన్స్‌ తెలిసిందే. అయితే, అలీని సోలోగా తట్టుకున్న బాబా భాస్కర్‌కి ఈ టాస్క్‌ ద్వారా, ఆడియన్స్‌లో బాగా సింపథీ ఏర్పడింది.

ఫిజికల్‌గా చాలా కష్టపడి అలీతో పోరాడాడు బాబా భాస్కర్‌. కానీ, ఫలితం దక్కలేదు. హింసకు దారి తీసిన కారణంగా ఈ టాస్క్‌ని మధ్యలోనే రద్దు చేశాడు బిగ్‌బాస్‌. దాంతో ఈ ఇద్దరూ ఈ వారం హౌస్‌ నుండి బయటికి వెళ్లేందుకు నామినేట్‌ అయ్యారు. వీరితో పాటు, శివజ్యోతి, శ్రీముఖి, వరుణ్‌ కూడా నామినేట్‌ అయ్యారు. ఈ ఐదుగురి నుండీ ఈ వారం ఎవరో ఒకరు ఎలిమినేట్‌ కాక తప్పదు. ఇక ఫైనల్‌ వెర్షన్‌ విషయానికి వస్తే, ఈ సారి బిగ్‌బాస్‌ టైటిల్‌ లేడీదే అనీ, అది కూడా శ్రీముఖిదేననీ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే, బిగ్‌బాస్‌లో ఏదైనా జరగొచ్చు.

మరిన్ని సినిమా కబుర్లు
Who is going to romance with megastar?