Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
rahul got finale ticket

ఈ సంచికలో >> సినిమా >>

మెగాస్టార్‌తో రొమాన్స్‌ చేయబోయే ఆ భామ ఎవరు?

Who is going to romance with megastar?

మెగాస్టార్‌ - కొరటాల శివ సినిమా కోసం హీరోయిన్‌ వేట కొనసాగుతోంది. హీరోయిన్‌గా పలువురు భామల పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా త్రిష పేరు తెర పైకి వచ్చింది. చాలా కాలంగా త్రిష పేరు వినిపిస్తున్నా తాజాగా త్రిష దాదాపు సెట్‌ అయ్యిందనే వార్త హల్‌చల్‌ చేస్తోంది. అయితే, మరో లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఏంటంటే, అసలు ఈ ప్రపోజల్‌ త్రిషను చేరనేలేదట. ఈ విషయం స్వయంగా త్రిష నోటితోనే చెప్పింది. మెగాస్టార్‌తో ఛాన్స్‌ వస్తే అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది.? ఆయన లెజెండ్‌. ఆయనతో నటించడం చాలా చాలా స్పెషల్‌గా ఉంటుంది. కానీ, అలాంటి ప్రపోజల్‌ తన వద్దకు రాలేదనీ, ఒకవేళ వస్తే ఎంత బిజీగా ఉన్నా ఆ ఛాన్స్‌ వదులుకోననీ త్రిష చెప్పింది.

అఫ్‌ కోర్స్‌ మెగాస్టార్‌తో రొమాన్స్‌ చేసే ఛాన్స్‌ వస్తే, ఎవ్వరు మాత్రం ఎందుకు వదులుకుంటారులెండి. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్‌ భామల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. చిరంజీవి అడిగారని బిగ్‌బీ తన విలువైన సమయాన్ని కేటాయించి, 'సైరా'లో కీలక పాత్ర పోషించారు. ఇక ముద్దుగుమ్మల గురించి చెప్పాలా.? అవకాశమొస్తే అతుక్కుపోరూ. డబుల్‌ ధమాకా. మెగాస్టార్‌ పక్కన నటించే ఛాన్స్‌ ఒకవైపు, సౌత్‌ ఎంట్రీకి గ్రాండ్‌ వెల్‌కమ్‌ ఇంకోవైపు.. అనేలా ఫీలవుతారు మరి. చూడాలి ఆ బంపర్‌ ఛాన్స్‌ ఏ ముద్దుగుమ్మని వరించనుందో.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam