Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
naneelu

ఈ సంచికలో >> శీర్షికలు >>

స్నేహం – జీవితంతో కలయిక - ..

Friendship - a combination of life

ఒక వయసు దాటిన తర్వాత స్నేహితులతో సంబంధాల కంటే మిగతా సంబంధాలు మన జీవితంలో ప్రాముఖ్యత వహిస్తాయి. స్నేహ బంధం కేవలం ఇచ్చి-పుచ్చుకోటం కన్నా గొప్ప బంధం అని సద్గురువు సెలవిస్తున్నారు. నిజానికి అది జీవితంతో పెనవేసుకున్న బంధం. సోషల్ మీడియా అతి వ్యాప్తంగా ఉన్న ఈ రోజుల్లో, ఇంతకుముందు ఊహించలేనంత మందితో ప్రపంచ వ్యాప్తంగా స్నేహ సంబంధాలు ఏర్పరుచుకోవటం అతి తేలికైన విషయం! ఒక స్నేహితుడిని కలుపుకోవాలంటే ఒక్క బటను నొక్కటమే! వాళ్ళకి మీ విశేషాలన్నీ ట్వీట్ల ద్వారా నిమిషంలో తెలియ చేయవచ్చు! మీ బ్లాగ్ కి అతి తక్కువ సమయంలో వందలు – కాదు వేలల్లో అనుయాయీలు చేరి పోతారు! ఇలా ప్రపంచ వ్యాప్తంగా స్నేహిత బృందం ఏర్పరుచుకోవడానికి అనేక మార్గాలున్నాయి. మీ కాల్పనిక జగత్తులో స్నేహితులు ఇంకా అనుయాయీల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కానీ నిజమైన స్నేహితులు ఎంత మంది అని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మీ ఉద్దేశ్యంలో స్నేహం అంటే ఏమిటి? స్నేహం అంటే తన అభిప్రాయం ఏమిటో సద్గురువు ఇవాళ చెబుతున్నారు.

సద్గురు: నాకు 3 లేక 4 ఏళ్ళప్పుడు స్కూలుకి పంపించినప్పుడు నేను మొదటి స్నేహితుడిని చేసుకున్నాను. అతనితో ఎంత గాఢమైన బంధం ఏర్పరుచుకున్నానంటే అన్నిటికన్నా అతనే నాకు చాలా ముఖ్యం. అతని పేరు నాకు ఇప్పటికి జ్ఞాపకం ఉంది – కాని బహుశా అతను నా పేరు ఎప్పుడో మర్చి పోయి ఉంటాడు. నాకు రక రకాలైన వందల కొద్దీ స్నేహితులు అన్ని చోట్లా ఉన్నారు – అది వేరే విషయం. నేను నా నిజమైన స్నేహితులతో ఎలాంటి బంధాలు ఏర్పరుచుకున్నానో చెబుతున్నాను. ఆ అనుబంధాలు పరిపూర్ణమైనవని ఎప్పుడూ అనుకునే వాడిని. కానీ కొంత కాలం తర్వాత జీవితం నేర్పిన పాఠంతో చాలా కొద్దిమంది మాత్రమే స్నేహ బంధాలని నేను చూసినట్లుగా చూస్తారని తెలుసుకున్నాను. చాలామంది స్నేహం అన్నది ఒక సందర్భానికి పనికి వచ్చేదిగా చూస్తారు. మీకు స్కూల్లో ఒక రకమైన స్నేహితులు ఉంటారు. స్కూలు పూర్తి కాగానే వాళ్ళను వదిలేసి కాలేజీలో కొత్త స్నేహితులను చేసు కుంటారు. కాలేజి తర్వాత ఉద్యోగస్తులు  హితులౌతారు.  సామాన్యంగా స్నేహం ఇలానే ఉంటుందనుకుంటారు. కానీ నేను స్నేహాన్ని అలా ఎప్పుడూ చూడలేదు. దీని మూలాన నాకు అసంతృప్తి ఏమీ లేదు కానీ మానవ నైజం మీద అది ఒక అవగాహనానుభవం కలిగింది. నాకు స్నేహం యొక్క ఆవశ్యకత అంతగా లేకపోయినా ఒక సారి స్నేహం చెస్తే అది జీవితాంతం వరకు అన్ని విధాలుగా పరి పూర్ణంగా ఉంటుందని అనుకునే వాడిని. నాకు కొద్దిమంది మంచి స్నేహితులు అక్కడక్కడ దొరికారు – కానీ వాళ్ళకి కూడా జీవితంలో వచ్చే మార్పులతో పాటు వాళ్ళ అవసరాలు, స్నేహం యొక్క అర్ధం మారి పోతాయి. కానీ నాకు ఎప్పుడూ మారవు.దాని వల్ల నాకు గుండెలు పగిలేల దుఖం కలగలేదు. కానీ చాలా మంది జీవితాంతం వరకు గాఢ మైన స్నేహానుబంధాలు పెట్టుకోలేరని నిరుత్సాహం కలిగేది. వాళ్లకి ఏదైనా అవసరం ఉంటె స్నేహితులు కావాలి. స్నేహం అన్నది స్నేహం కోసం కాకుండా కేవలం అవసరాల కోసం స్నేహం చేస్తారు. 

వారి అవసరం తీరగానే ఆ స్నేహం వారికి ఇహ అక్కరలేదు. నా స్నేహం జీవితంతో మారదు. నేను స్నేహాన్ని అలా చూడలేను. ఇలాంటి విషయాలలో నేను కొంచం పిచ్చి వాడిని. ఇప్పుడు కూడా నా స్కూల్ స్నేహితుడెవరైనా కలిస్తే నేను చిన్నప్పుడు వాడితో ఎలా ప్రవర్తించే వాడినో ఇప్పుడు కూడా అలాగే ప్రవర్తిస్తాను. కానీ అతను పూర్తిగా మారిపోయి ఉంటాడు. చిన్నప్పటి స్నేహ భావం ఉండదు. బహుశా వాళ్ళు జీవితంతో పాటు మారుతూ ఉంటారు – నేను మారను. నేను స్నేహాన్ని జీవితంతో ముడి పెట్టను. నేను జీవితం విలువలు మార్చను. అందుకనే స్నేహంలో నా ప్రవర్తన ఇప్పటికీ, ఎప్పటికీ మారదు. జీవితం నా పట్ల అసాధారణ ఔదార్యం చూపించింది. ఔదార్యం అంటే లౌకిక విషయాలలో అని కాదు. జీవితం నాతొ ఎలా వ్యవహరిస్తుందంటే, నేను ఎక్కడికి వెళ్ళినా సరే అతి సులువుగా నా ప్రయత్నం లేకుండానే జీవితం అతి చక్కగా సాగి పోతుంది. బహుశా నేను విశ్వంలో దేనితో నైనా ఏర్పరుచుకునే అనుబంధాల వల్ల జీవితం తన రహస్యాలన్నీ నాతొ పంచుకోటానికి తయారుగా ఉంది. నేను అతి చిన్న సామాన్య జడ పదార్ధంతో కూడా ఒక రకమైన ప్రత్యెక అనుబంధాన్ని ఏర్పరుచుకుంటాను. ఉదాహరణకి మైసూరుని తీసుకోండి. నేను మైసూరులోనే చాలా మటుకు పెరిగాను కాబట్టి నాకు మైసూరుకు గాఢమైన సంబంధం ఏర్పడింది. నేను మిగతా వాళ్ళ మాదిరిగా భావోద్వేగంతో చూడటం లేదు. నేను అక్కడి భూమితో, చెట్లతో, కొండలతో చుట్టుపక్కల ఉన్న ప్రతి దానితో అవినాభావ సంభందం ఏర్పరుచుకున్నాను. గత 30 ఏళ్ళల్లో చాలా మార్పులు వచ్చాయి. కానీ నేను చిన్నప్పుడు నడిచిన ప్రదేశాలు, వాటితో పెట్టుకున్న గాఢ సంబంధాలు, నాలో పుట్టిన కోటాను కోట్ల ప్రశ్నలను అడిగిన కోటాను కోట్ల మైసూరు ప్రదేశాలు – అన్నీ అలాగే ఉన్నాయి. నాకు వాటన్నిటితోను ఉన్న ప్రత్యేకమైన అనుబంధం వల్ల నాలో ఒక అన్వేషణ పుట్టింది.

నాకు మైసూరు అంటే కోట్ల ప్రశ్నలు, అదే సమయంలో నమ్మ శక్యం కాని జవాబు కూడా మైసూరే! స్నేహాలన్నా అంతే! నేను ఎవరితోనైనా కొంచెం సమయం గడిపితే (భావోద్వేగంలో కాదు- నేను ఎవరితోనూ భావోద్వేగామైన సంబంధాలు పెట్టుకోలేదు) తెలిసో, తెలియకో ఆ క్షణాలు వారితో కలిసిపోయి మమేకం చెందేవాడిని. పంచుకోవటం అంటే నా ఉద్దేశంలో ఇచ్చి-పుచ్చు కోవటం కాదు. పంచుకోవటం అంటే రెండు జీవితాలు ఒక దానితో ఒకటిగా పెనవేసుకు పోతాయన్న మాట. స్నేహం అంటే స్వ ప్రయోజనాల కోసం కాని ఏదైనా లాభం కోసం చేసే పనిముట్టు కాదు – అది నీ జీవితాన్ని మరింత ఆనందమయం చేస్తుంది.

ఇప్పుడు కూడా నేను ప్రపంచం అంతటా తిరుగుతూ అన్ని రకాల మనుషులని కలుస్తున్నా, వాళ్ళతో పరిచయం పెంచుకోవాలనుకోను. వాళ్ళ ఫోనే నంబర్లు తీసుకొను. వాళ్ళతో పరిచయం పెంపొందించు కోవడానికి ప్రయత్నం చెయ్యను. కానీ వాళ్ళతో గడిపిన ఆ కొద్ది క్షణాలలో వారితో అతి గాఢమైనదేదో పంచుకుంటాను. అలాగే వాళ్ళల్లో చాలా మంది కూడా నాతొ అలానే పంచుకుంటారు. కానీ నాకు సంబంధించినంత వరకూ ఆ పంచుకోవడం అన్నది శాస్వతమైన ప్రక్రియ. కానీ చాలా మందికి అది క్షణికమైన ప్రక్రియ. బహుశా స్నేహం మీద నా అభిప్రాయం చాలా పాత కాలందై ఉండవచ్చు. అసలు అలాంటి స్నేహం ఎప్పుడైనా అసలు ఉందొ లేదో కూడా తెలియదు. బహుశా అలాంటి స్నేహం కొంచం పిచ్చి లాగా అనిపిస్తుందేమో. సాంఘికంగా అది నచ్చక పోవచ్చు. కానీ దేనితో నైనా – చెట్టు కానివ్వండి, నేను కూచున్న చోటు కానివ్వండి, ఒక భూమి కానివ్వండి, ఒక బండ రాయి కానివ్వండి మనుషులు కానివ్వండి – గాఢ సంబంధం పెట్టుకోవటం వల్ల జీవితంలోనూ ప్రకృతిలోనూ ఎన్నో పార్శ్వాలు నాకు అవగాతమైనాయి. కాబట్టి నా మటుకు స్నేహం అంటే ఒక లాభ దాయకమైన లావా-దేవీ కానీ ఇచ్చి-పుచ్చుకునే వ్యవహారం కానీకాదు. స్నేహం అంటే ఓ విధంగా జీవం పెనవేసుకోవడమే.

ప్రేమాశీస్సులతో,
సద్గురు 

మరిన్ని శీర్షికలు
be careful