Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Finding Employment.!

ఈ సంచికలో >> శీర్షికలు >>

ముందస్తు దంతవైద్య పరీక్షలు అవసరమా - డా.కె.ఎల్ .వి.ప్రసాద్, హనంకొండ

Do pre-dental examinations be required

మానవ జీవితంలో ,నిత్యావసర అంశాల్లో ,మందులు కూడా చేరిపోయాయి. నెలకు వాటికోసం కొంత సొమ్ము కేటాయించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి .దీనికి వయసుతో పనిలేదు .పుట్టినప్పటి నుంచి వృద్దాప్యం వచ్చే వరకూ ఇదే పరిస్తితి .శరీరం మందుల మయం ఐపోతున్నది .మనిషి సగటు జీవిత కాలం పడిపోతున్నది. జీవితంలో ,అనారోగ్యానికి ,తద్వారా  విపరీతంగా మందులు వాడడానికి,కారణాలు అనేకం ఉన్నప్పటికి ,కొన్ని కనీస జాగ్రత్తలు పాటించటం ద్వారా కొన్ని అనారోగ్య సమస్యల బారినుండి 

తప్పించుకుని ఆనందమయ జీవితం గడిపే అవకాశం ఉంది .ఎప్పుడో ..ఏదో సమస్య వచ్చినపుడు వైద్యుడి దగ్గరికి పరిగెత్తడం అనే సిద్ధాంతానికి తిలోదకాలు పలికి ,సమస్యతో సంబంధం లేకుండా , సంవత్సరానికి కనీసం ,రెండు సార్లు ' ముందస్తు ..వైద్య  పరీక్షలు  '(ప్రివెన్షన్ ఈజ్ బెటర్  దే  న్  క్యూర్ ) చేయించుకోవాలి .దంత  వైద్య పరీక్షలు దీనికి అతీతం కాదు ! ముందస్తు దంత వైద్య పరీక్షలు ఎందుకు ...? ఆరోగ్యమే మహాభాగ్యం ' అన్నారుకదా .అంటే మనం ఆరోగ్యంగా ఉంటే ,మన బాంక్ అకౌంట్ లో సొమ్ము ,కొన్ని వేలు లేదా లక్షలు భద్రంగా దాచుకున్నట్టే కదా ! అందుకే ముందస్తు దంత వైద్య పరీక్షలు . దంతాల పరిస్తితి ,దంత సంరక్షణ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుసుకునే అవకాశం ఉంది . పాలపళ్ళు ఆగమనం ,దంత ధావన విదానాలు ఇతర జాగ్రత్తలు గురించి తెలుసుకుని ,ముందుగానే అప్రమత్తమయ్యే అవకాశం ఉంది .

దంత సమస్యలను ముందుగానే గుర్తించి ,ఆది లోనే ,తగిన చికిత్స చేయించుకుని ,దంతాలు జీవిత కాలమంతా ఆరోగ్యం గ ,ఉంచుకునే మంచి అవకాశం లభిస్తుంది .ఆహరం నమిలి ,మంచిగ జీర్ణం చే సుకుని , రక్తంగా మారే విషయంలో ,దంతాల పాత్ర ఎంతటిదో  అవగాహన అవుతుంది.

డా .కె .ఎల్ .వి.ప్రసాద్ .
రిటైర్డ్ సివిల్ సర్జన్ (డెంటల్ )
హనంకొండ 

మరిన్ని శీర్షికలు
edaripoolu book review