Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
rrr latest

ఈ సంచికలో >> సినిమా >>

జేజమ్మ మళ్లీ బిజీ కానుందా.?

Will Jejamma get busy again

జేజమ్మ అనుష్క గత రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంది. ఈ గ్యాప్‌లో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టింది అనుష్క. 'సైజ్‌జీరో' కారణంగా పెరిగిన బరువును తగ్గించుకునేందుకు కిందా మీదా పడింది. ఎట్టకేలకు ఆ బరువు బాధ్యతలు తీర్చుకున్న అనుష్క ఇటీవల విడుదలైన 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో ఓ చిన్న క్యారెక్టర్‌లో కనిపించి మెస్మరైజ్‌ చేసింది. ప్రస్తుతం 'నిశ్శబ్ధం' అనే బహు భాషా సినిమాలో లీడ్‌ రోల్‌ పోషిస్తోంది. వీటితో పాటు, అనుష్క చెంతకు మరికొన్ని ప్రెస్టీజియస్‌ ప్రాజెక్టులు క్యూ కడుతున్నాయని తెలుస్తోంది. స్టార్‌ హీరోలు చిరంజీవి, వెంకటేష్‌ సినిమాల కోసం అనుష్కను పరిశీలిస్తున్నారట. చిరంజీవి - కొరటాల సినిమాకి త్రిష పేరుతో పాటు, అనుష్క పేరు కూడా లిస్టులో ఉంది. ఇక వెంకటేష్‌ నటిస్తున్న 'అసురన్‌' రీమేక్‌లోనూ అనుష్క పేరే మొదట వరుసలో ఉంది. తాజాగా తమిళంలో ఓ హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీకి అనుష్క సైన్‌ చేసిందని కోలీవుడ్‌ సమాచారం. ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో అనుష్క నటించనుందట.

ఈ సినిమాలో తమిళ అగ్ర హీరో సూర్య కీలక పాత్ర పోషించనున్నాడట. కథ హీరోయిన్‌ చుట్టూ తిరిగేది కావడంతో, ఆ పాత్రలో క్రేజీ హీరోయిన్‌ అయితే బావుంటుందని భావించి, అనుష్కను ఎంచుకున్నారనీ తెలుస్తోంది. అనుష్క, సూర్య కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'సింగం' సిరీస్‌ మూవీస్‌ సూపర్‌ హిట్స్‌ అయిన సంగతి తెలిసిందే. సో చూస్తే, అనుష్క మునుపటిలానే బిజీ కానుందనిపిస్తోంది.

మరిన్ని సినిమా కబుర్లు
laugh  program without a nagababu