Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

రాగల 24 గంటల్లో చిత్రసమీక్ష

ragala 24 gantallo movie review

చిత్రం: రాగల 24 గంటల్లో
నటీనటులు: ఈషా రెబ్బా, సత్యదేవ్‌, శ్రీరామ్‌, గణేష్‌ వెంకట్రామ్‌, మస్కాన్‌ సేథి, కృష్ణ భగవాన్‌, టెంపర్‌ వంశీ, అజయ్‌, అనురాగ్‌, రవి వర్మ, రవిప్రకాష్‌, మానిక్‌ రెడ్డి, అదిరే అభి తదితరులు.
సంగీతం: రఘు కుంచె
సినిమాటోగ్రఫీ: గరుడ వేగ అంజి
నిర్మాణం: శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్‌
నిర్మాతలు: శ్రీనివాస్‌ కానూరు
దర్శకత్వం: శ్రీనివాస్‌ రెడ్డి
విడుదల తేదీ: 22 నవంబర్‌ 2019

క్లుప్తంగా చెప్పాలంటే..

ముగ్గురు నేరస్తులు జైలు నుంచి తప్పించుకునే క్రమంలో ఓ ఇంట్లోకి చొరబడ్తారు. ఆ ఇంట్లో విద్య (ఈషా రెబ్బా) వుంటుంది. ఆ ముగ్గురు నిందితులకీ ఆ ఇంట్లో రాహుల్‌ (సత్య దేవ్‌) విగత జీవిగా కన్పిస్తాడు. ఆ మృతదేహం ఎవరిదని నిందితులు ప్రశ్నిస్తే, అతను తన భర్తేనని చెబుతుంది విద్య. విద్యని రాహుల్‌ ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. మరి, రాహుల్‌ ఎలా చనిపోయాడు? ఇంతకీ, అత్యాచారం కేసులో జైలు నుంచి తప్పించుకున్న నిందితులు అసలెవర్ని అత్యాచారం చేశారు? ఆ ముగ్గురు నిందితులకీ రాహుల్‌కి సంబంధమేంటి.? ఇలా చాలా ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

మొత్తంగా చెప్పాలంటే..

తెలుగమ్మాయ్‌ ఇషా రెబ్బా తన సహజమైన నటనతో ఆకట్టుకుంది. అందం, అభినయం విషయంలో ఆమెకు మంచి మార్కులు పడతాయి. నెగెటివ్‌ షేడ్స్‌ వున్న పాత్రలో సత్యదేవ్‌ బాగా చేశాడు. పోలీస్‌ అధికారి పాత్రలో శ్రీరామ్‌ ఈ సినిమాకి మరో స్పెషల్‌ ఎట్రాక్షన్‌. ఈషా ఫ్రెండ్‌ పాత్రలో గణేష్‌ వెంకట్రామన్‌ రాణించాడు.

'పైసా వసూల్‌' ఫేం ముస్కాన్‌ సేథి ఈ సినిమాలో మోడల్‌ పాత్రలో కన్పించింది. కృష్ణ భగవాన్‌, రవివర్మ తదితరులు తమ పాత్రల పరిధి మేర బాగా చేశారు. టెంపర్‌ వంశీ, అజయ్‌, అనురాగ్‌ పాత్రలు సినిమాలో కీలకం. ఈ ముగ్గురూ బాగానే మెప్పించారు తమ నటనతో.
ఇంట్రెస్టింగ్‌ కథకి, అంతే ఇంస్ట్రింగ్‌గా కథనాన్ని కూడా తయారు చేసుకోవడం సినిమాకి కలిసొచ్చింది. శ్రీనివాస రెడ్డి అనగానే కామెడీ సినిమాల స్పెషలిస్ట్‌ గుర్తుకొస్తాడు. ఈ సినిమాలో థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తోపాటు, కామెడీకి కూడా ప్రాధాన్యమివ్వడం కలిసొచ్చింది. సినిమాటోగ్రపీ బావుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఓకే. నిర్మాణపు విలువలు బావున్నాయి. సినిమాని రిచ్‌గా తెరకెక్కించేందుకు ప్రయత్నించారు. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ వర్క్‌ బావుంది. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త కత్తెర పదును అవసరం అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో సాగతీతకు కత్తెర పదను చూపించి వుంటే బావుండేది.

కామెడీని బేస్‌ చేసుకుని వచ్చిన థ్రిల్లర్‌ సినిమాల్లో కొన్ని హిట్టయితే, కొన్ని తేడా కొట్టేశాయి. అయితే, థ్రిలర్‌ కాన్సెప్ట్‌తో వచ్చే సినిమాలకు హైప్‌ బాగానే క్రియేట్‌ అవుతోంది సినిమా రిలీజ్‌కి ముందు. ఈ సినిమా విషయంలోనూ హైప్‌ అలాగే క్రియేట్‌ అయ్యింది. దానికి తగ్గట్టుగానే థ్రిల్లింగ్‌ అంశాలు వున్నా, అవి ఇంకాస్త థ్రిల్లింగ్‌గా వుంటే బావుండేదన్పిస్తుంది. కొన్ని సన్నివేశాల సాగతీత సినిమా గమనానికి బ్రేకులేసింది. ఇంట్రెస్టింగ్‌ కథ, తర్వాత ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ ఇవన్నీ సినిమాని థ్రిల్లింగ్‌ ప్రేక్షకులు ఇష్టపడేలానే చేస్తుంది. ఓవరాల్‌గా ఓ మోస్తరు థ్రిల్లర్‌గా బాక్సాఫీస్‌ వద్ద బాగానే స్కోర్‌ చేసే అవకాశాలున్నాయి ఈ సినిమాకి.

ఒక్క మాటలో చెప్పాలంటే..
'రాగల 24 గంటల్లో' కొంచెం థ్రిల్లింగ్‌గానే వుందిగానీ..

అంకెల్లో చెప్పాలంటే..
3/5

మరిన్ని సినిమా కబుర్లు
rrr latest