Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
laugh  program without a nagababu

ఈ సంచికలో >> సినిమా >>

నిధిని వదలనంటోన్న పూరీ.!

Puri is not leaving the nidhi agarwal

క్రేజీ హీరోయిన్‌గా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్‌కి అసలు సిసలు హిట్‌ దక్కింది మాత్రం 'ఇస్మార్ట్‌ శంకర్‌'తోనే. పూరీ జగన్నాధ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, నిధి అగర్వాల్‌తో పాటు, పూరీకి సక్సెస్‌ తెచ్చి పెట్టింది. దాంతో, నిధి అగర్వాల్‌ని లక్‌గా భావించిన పూరీ, తన తదుపరి చిత్రానికి కూడా రిపీట్‌ చేయాలనుకుంటున్నాడట. 'ఇస్మార్ట్‌ శంకర్‌' తర్వాత పూరీ జగన్నాధ్‌ - విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో 'ఫైటర్‌' మూవీ తెరకెక్కుతోంది.

ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నిధి సెట్‌ అయ్యిందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ నిజమే అయితే, నిధి జాక్‌ పాట్‌ కొట్టినట్లే. ఇటీవల ఛార్మితో కలిసి నిధి అగర్వాల్‌ గోవాలో దిగిన ఫోటో ఒకటి నెట్టింట్లో హల్‌చల్‌ చేసింది. అంటే, పూరీ సినిమాలో నిధి అగర్వాల్‌ ఫిక్స్‌ అయినట్లే అన్న మాటకు బలం చేకూరినట్టనిపిస్తోంది. ఏది ఏమైతేనేం, ప్రస్తుతం నిధి అగర్వాల్‌ చేతిలో ఓ తమిళ సినిమా తప్ప, ఒక్క తెలుగు ప్రాజెక్ట్‌ కూడా లేదు. పూరీ రూపంలో 'ఫైటర్‌' చిక్కితే, మరికొద్ది రోజులు నిధి అగర్వాల్‌ డిస్కషన్స్‌లో నిలుస్తుంది. మరోవైపు పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌లో రూపొందుతోన్న ఆకాష్‌ పూరీ చిత్రం 'రొమాంటిక్‌'లోనూ నిధి స్పెషల్‌ సాంగ్‌ చేస్తోందని టాక్‌. నిజంగానే నిధి అగర్వాల్‌ని పూరీ వదలలేక పోతున్నాడా.?  చూడాలి మరి. డిశంబర్‌లో ఈ సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam